అతని ఓపిక చూసి ప్రేరణ పొందుతున్నాం

అతని ఓపిక చూసి ప్రేరణ పొందుతున్నాం
x
Shashi Tharoor, Sanju samson
Highlights

క్రికెటర్‌ సంజూ శంసన్‌‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ తప్పుబట్టారు.

క్రికెటర్‌ సంజూ శంసన్‌‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ తప్పుబట్టారు. కేరళకు చెందిన క్రికెటర్ సంజూ శంసన్‌ గత కొన్ని కాలంగా జట్టుతోనే ప్రయాణిస్తు్న్నారు. అయినప్పటికీ ఇంత వరకు అతన్ని ఒక్క మ్యాచ్ కూడా ఆడించకపోవడంపై పలువురు సినీయర్ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు.

కాగా.. రెగ్యులర్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ కొంత కాలంగా ఫామ్ కోల్పోయాడు. అంతే కాకుండా విండీస్ తో జరిగిన సిరీస్ లో కీలక సమయంలో క్యాచ్ లు జారవిడిచాడు. దీంతో పంత్ ను తొలిగించి సంజూకి అవకాశం ఇవ్వాలని గౌతమ్‌ గంభీర్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఒక్క మ్యాచ్‌ అవకాశం ఇస్తే శాంసన్‌ ప్రతిభ తెలుస్తుందని, ఎంపీ మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ వాఖ్యానించారు. అయితే దీనిపై కాంగ్రెస్ నేత శశిథరూర్‌ కూడా తన అభిప్రాయం చెప్పారు. శాంసన్ ఆడిస్తే సొంత మైదానంలో టీమిండియా గెలిపించే సత్తా అతడికి ఉంటుందని భావిస్తున్నానని అన్నారు. శాంసన్‌ ఓపికను చూసి తామంతా ప్రేరణ పొందులతున్నామన్నారు. బంగ్లాదేశ్‌ సిరీస్‌ తర్వాత శాంసన్‌ను ఆడించకపోవడంపై శశిథరూర్‌ ట్వీట్‌ చేశారు. అతడి బ్యాటింగ్ పరీక్షించాలని చూస్తున్నారా? లేక అతని ఓపికను పరీక్షించాలి చూస్తున్నారా? అని ట్విట్ చేశారు. రిషబ్ పంత్ ఫామ్ పై పలు ప్రశ్నలకు కోహ్లీ సమాధానం ఇచ్చారు. పంత్ ఫామ్ లోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే పంత్ కు కోహ్లీ మద్దతు ఉండడంతో అతడ్ని జట్టు నుంచి తొగిలించే ప్రయత్నం చేయడం లేదు.


Show Full Article
Print Article
Next Story
More Stories