అతని ప్రతిభపై నమ్మకం ఉంది: కోహ్లీ

అతని ప్రతిభపై నమ్మకం ఉంది: కోహ్లీ
x
విరాట్ కోహ్లీ
Highlights

వెస్టిండీస్ , టీమిండియాల మధ్య మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు జరగనున్నాయి.

వెస్టిండీస్ , టీమిండియాల మధ్య మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా సమావేశంలో మాట్లాడారు. విండీస్ సిరీస్ లో ప్రయోగాత్మక మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు. బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా చాలా మార్పులు జట్టు పటిష్టంగా ఉంది వెల్లడించారు. 2020లో జరిగే టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకొని జట్టు కూర్పులో మార్పులు చేయనున్నామని తెలిపారు. రిషబ్ పంత్ ఫామ్ పై కోహ్లీని ప్రశ్నించగా.. పంత్ ప్రతిభపై తమకు పూర్తి విశ్వాసం ఉందని అభిప్రాయపడ్డారు. పంత్ తప్పకుండా మళ్లి గాడిలో పడతారని ధీమా వ్యక్తం చేశారు.

అయితే టీ20ల్లో భారత జట్టు ర్యాంకింగ్స్ గురించి తాము పట్టించుకోవడం లేదని తెలిపారు. తమ దృష్టి టీ20 సిరీస్ లో గెలవాలనే దానిపైనే ఉందని చెప్పారు. జాడేజా తమ జట్టకు అదనపు బలమన్నారు. పొట్టి ఫార్మాట్ లో జాడేజా కీలక ఆటగాడని కోహ్లీ చెప్పారు. మూడు టీ20ల సిరీస్ భాగంగా విండీస్ భారత్ మధ్య తొలి టీ20 శుక్రవారం హైదరాబాద్‌లోని ఉప్పల్ వేధికగా జరగనుంది. బంగ్లాదేశ్ పై జరిగిన టీ20 సిరీస్‌కు కెస్టెన్‌గా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ వ్యహరించారు. కోహ్లీ విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన టెస్టు సిరీస్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహారించారు. తాజాగా విండీస్ పై జరిగే టీ20 సిరీస్ కు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories