Ind Vs WI 3rd T20 : భారత బౌలర్లు ధాటికి విండీస్ టాప్ ఆర్డర్ కుదేలు

Ind Vs WI 3rd T20 :   భారత బౌలర్లు ధాటికి విండీస్ టాప్ ఆర్డర్ కుదేలు
x
India Vs West Indies
Highlights

టీమిండియా విండీస్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఫైనల్ పోరులో భారత్ భారీ స్కోరు సాధించింది. 241పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఆరంభంలోనే...

టీమిండియా విండీస్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఫైనల్ పోరులో భారత్ భారీ స్కోరు సాధించింది. 241పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. భారత ఫేస్ బౌలర్లు విజృభించడంతో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. రెండో టీ20లో టీమిండియా బౌలర్లపై విరుచుపడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన లెండిల్‌ సిమన్స్ (7) పరుగులకే షమీ ఔట్‌చేశాడు. మరో ఓపెనర్ కింగ్(5) పరుగుల వద్ద షమీ బౌలింగ్ లో రాహుల్ క్యాచ్ చేతికి దొరికిపోయాడు. నికోలస్‌ పూరన్ పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. హెట్‌మైర్ (41,24బంతుల్లో, 1 ఫోర్లు,5 సిక్సులు) సహకారంతో రాణించాడు. కెప్టెన్ పొలార్డు (32) క్రీజులో ఉన్నాడు

అంతకుముందు టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ పొలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. నిర్ణిత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఓపెనర్ రాహుల్(91, 56బంతుల్లో, 9ఫోర్లు, 4 సిక్సులు)తో సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. కోహ్లీ(70,29 బంతుల్లో, 4 ఫోర్లు ,7 సిక్సుల)తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్ ఆరంభించిన భారత్ జట్టు‎ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. సొంత గడ్డపై రోహిత్ శర్మ(71, 34 బంతుల్లో, 6 ఫోర్లు, 5 సిక్సులు)తో చెలరేగిపోయాడు. ఇద్దరు ఓపెనర్లు బౌండరీలు, సిక్సర్లుతో విండీస్‌ బౌలర్లపై విరుచుపడ్డారు. తొలి వికెట్‌కు 135పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రమాదకరంగా మారిన ఓపెనర్ల జోడిని కేస్రిక్ వీడతీశాడు. కోహ్లీ, రాహుల్ మూడో వికెట్ కు 91 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, పొలార్డ్‌, కేస్రిక్ తల ఒక వికెట్ దక్కించుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories