IndvsWI 3rd ODI : భారత్ ముందు భారీ లక్ష్యం

IndvsWI 3rd ODI :  భారత్ ముందు భారీ లక్ష్యం
x
Ind Vs WI pollard
Highlights

కటక్ వేదికగా టీమిండియా విండీస్ మధ్య జరిగిన మూడో వన్డేలో విండీస్ భారీ స్కోరు సాధించింది.

కటక్ వేదికగా టీమిండియా విండీస్ మధ్య జరిగిన మూడో వన్డేలో విండీస్ భారీ స్కోరు సాధించింది. భారత్ ముందు 316 పరుగుల విజయ లక్ష్యం ఉంచింది. పూరన్ (89, 64బంతుల్లో, 10 ఫోర్లు, 3 సిక్సులు), కెప్టెన్ పోలార్డ్ (74, 51బంతుల్లో, 3పోర్లు, 7 సిక్సులు) ఆర్థ సెంచరీలతో రాణిచారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి విండీస్‌ను భారత్ బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బ్యాటింగ్ ప్రాంభించిన విండీస్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. ఓపెనర్ లూయిస్ (21 పరుగులు, 50బంతుల్లో, 3ఫోర్లు,) చేసి జాడేజా బౌలింగ్‌లో ఔటైయ్యాడు. హోప్ (42పరుగులు, 50 బంతుల్లో, 5 ఫోర్లు ) షమీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

32 ఓవర్లు ముగిసేసరిగి విండీస్ నాలుగు వికెట్లు నష్టానికి 145 పరుగులు చేసింది. హెట్‌మైర్ (37 పరుగులు, 33 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సులు)నవదీప్‌ సైనీ విసిరిన ఔట్ సైడ్ ఆఫ్ స్టేప్ బంతిని అర్ధం చేసుకోవడంలో విఫలమైయ్యాడు. దీంతో బ్యాట్ ఎడ్జ్ కి తాకి కుల్ దీప్ యాదవ్ చేతికి దొరికిపోయాడు. నవదీప్‌ సైనీ అనంతరం ఛేజ్(38) కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు.

దీంతో 144 నాలుగు వికెట్లు కోల్పోయి విండీస్‌ను పూరన్ (89, 64బంతుల్లో, 10 ఫోర్లు, 3 సిక్సులు)లతో, కెప్టెన్ పోలార్డ్ (74, 51బంతుల్లో, 3పోర్లు, 7 సిక్సులు) ఆర్ధసెంచరీలతో ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కు 135 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. పోలార్డ్ ఏకంగా 7 సిక్సులతో భారత బౌలర్లపై విరుచుపడ్డాడు. హోల్డర్ 7పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ లో విండీస్ ఆటగాళ్లు కలిసి 12 సిక్సులు సాధించారు. అందులో పోలార్డ్ ఒక్కరే 7 సిక్సులు బాదాడు. భారత బౌలర్లలో జాడేజా, షమీ, ఠాకూర్ తలో ఓ వికెట్ తీశారు. నవదీప్‌ సైనీ రెండు వికెట్లు దక్కించుకున్నారు.

గాయం కారణంగా దీపక్‌ చాహర్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. నవదీప్‌ సైనీ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. తొలి వన్డేలో ఆడుతున్న నవదీప్‌ సైనీకి ‎విధ్వంసక ఆటగాడు హెట్‌మైర్ వికెట్ పడగొట్టడం విశేషం. ఇప్పటికే జరిగిన రెండు వన్డేల్లో ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమానంగా ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories