కాసేపట్లో భారత్ వెస్టిండీస్ మధ్య ఫైనల్ పోరు..రెండు జట్ల బలాబలాలు ఇవే..

కాసేపట్లో భారత్ వెస్టిండీస్ మధ్య ఫైనల్ పోరు..రెండు జట్ల బలాబలాలు ఇవే..
x
Highlights

టీమిండియా విండీస్ మూడు వన్డేల సిరీస్ ఆఖరి ఘట్టానికి చేరింది. రెండు వన్డేల్లోనూ ఇరుజట్లు చెరొకటి నెగ్గి సమానంగా ఉన్నాయి.

టీమిండియా విండీస్ మూడు వన్డేల సిరీస్ ఆఖరి ఘట్టానికి చేరింది. రెండు వన్డేల్లోనూ ఇరుజట్లు చెరొకటి నెగ్గి సమానంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిరీస్‌‌లో నిర్ణయాత్మక మూడో వన్డే ఇవాళ( ఆదివారం ) కటక్ వేదికగా జరగనుంది. జట్లు బలాబలాలపరంగా చూస్తే టీమిండియా జట్టుదే పైచేయి. అయితే కరిబియన్లు మాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇవాళ జరిగే వన్డేలో ఎవరూ గెలిస్తే వారిదే సిరీస్. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-1 కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కటక్ వేదికగా జరగనున్న ఈ వన్డేలో విండీస్ విజయం సాధించి భారత వరస సిరీస్ విజయాలకు బ్రేక్ వేస్తుందా? లేక భారత్ తమ జైత్రయాత్రను కొనసాగిస్తుందా? చూడాలి.

కటక్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది‌. భారీ స్కోరుకు చేసే అవకాశం ఉంది. రెండో సారి బ్యాటింగ్ చేసే జట్టుకు మంచు ప్రభావం ఉంటుంది కాబట్టి మరోసారి టాస్‌ గెలిచే జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి.

భారత జట్టు బలాలు బలహీనతలు చూస్తే:

ఇప్పటికే దీపక్‌ చాహర్‌ రూపంలో భారత్ కు పెద్ద దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఫామ్ లో ఉన్న ఈ బౌలర్ గాయం కారణంగా చివరి వన్డే మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో సీనియర్ బౌలర్ షమీపై భారం పడుతుంది. రెండో వన్డేలో వరస హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి ఊపువీద ఉన్న కుల్దీప్‌ యాదవ్‌ మరోసారి రాణింస్తే భారత్ విజయం తేలిక అవుతుంది. దీపక్‌ చాహర్‌ దూరం కావడంతో అతని స్థానంలో నవదీప్‌ సైనీని తుది జట్టులోకి తీసుకుంటుందా లేదా చూడాలి. నవదీప్‌ సైనీకు ఆఖరి మ్యాచ్ లో అవకాశం ఇస్తే ఒత్తిడికి లోనైయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నవదీప్‌ సైనీ వన్డేల్లో మొదటి సారి అరంగేట్రం చేస్తున్నాడు. కీలక మ్యాచ్ లో అతనికి అవకాశం ఇస్తారా లేదో చూడాలి. కెప్టెన్ విరాట్ కోహ్లీ లేదా స్పిన్నర్‌ తో బరిలోకి దిగితే శార్దుల్‌ స్థానంలో చహల్‌ బరిలోకి దిగవచ్చు.

భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే..

ఓపెనర్లు రోహిత్, రాహుల్‌ తిరుగులేని ఫామ్ లో కొనసాగుతున్నారు. రెండో వన్డే మొదటి వికెట్ కు రెండువందల పైచిలుకు భాగస్వామ్యం నమోదు చేశారు. అదే ఫామ్ కొనసాగించి. చివరి వన్డేలో కూడా శుభారంభం అందిస్తే భారీ స్కోరు సాందించే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్ లో రాణిస్తే భారత్ కు తిరుగుండదు. రెండు మ్యాచ్ ల్లో కోహ్లీ నాలుగు పరుగులు మాత్రమే చేసిన నిరాశపరిచాడు. రెండో వన్డేలో శ్రేయస్స్ అయ్యర్, పంత్‌ జంటగా మెరుపు ఇన్నింగ్స్ చేయడం కలిసోచ్చిన అంశం. భారత్ బౌలింగ్ కంటే బ్యాంటింగ్ లోనే సూపర్ ఫామ్‌లో కొనసాగుతుంది.

విండీస్ జట్టు బలాలు బలహీనతలు చూస్తే ‌:

విశాఖలో జరిగిన రెండో వన్డేలో భారత బ్యాట్స్‌మెన్‌ను నిలువరించడంలో విండీస్‌ బౌలర్లు విఫలమయ్యారు. కాట్రెల్‌ను, జోసెఫ్, హోల్డర్‌ రాణిస్తే విండీస్ కు తిరుగుండదు. స్పిన్నర్‌ ఖారీ పైర్‌ నుంచి పోలార్డ్ పొదుపైన బౌలింగ్‌ను ఆశిస్తుంది. బ్యాటింగ్‌లో ఓపెనర్‌ లూయిస్‌ , హోప్‌, అద్భుతమైన ఫామ్‌లో చెలరేగిపోతున్నారు. హెట్‌మైర్‌ విధ్వంసగా ఇన్నింగ్స్ అడితే విండీస్ భారీ స్కోరు నమోదు చేసే అవకాశం ఉంది. కెప్టెన్ పోలార్డ్ కూడా రాణించాల్సిన అవసరం ఉంది. గత మ్యాచ్‌లో పూరన్‌ మెరుపులు ఇన్నింగ్స్ ఆడితే విండీస్ ను నిలువరించడం కష్టం

అయితే టీమిండియా 2019లో 27 వన్డేలు ఆడితే ఏనిమిది మ్యాచ్లో ఓటమి చెందింది. మరో 18 మ్యాచ్‌లో విజయం సాధించింది. విండీస్ 5 ఏళ్ల తర్వాత అఫ్గానిస్తాన్‌పై తొలి వన్డే సిరీస్‌ నెగ్గిన ఉత్సాహంతో ఉంది. అదే ఊపును భారత్ పై కూడా కొనసాగించాలని చూస్తుంది. ఇక భారత్ వరస విజయాలు నమోదు చేసుకుంటూ 2019ని ఘనంగా ముగించాలని చూస్తుంది.

జట్లు అంచనా

భారత్‌: విరాట్ కోహ్లి (కెప్టెన్‌), రాహుల్, రోహిత్ శర్మ , శేయస్స్ అయ్యర్, రిషబ్ పంత్, జాదవ్, రవీంద్ర జడేజా, షమీ, కుల్దీప్ యాదవ్, సైనీ, శార్దుల్‌/చహల్‌.

వెస్టిండీస్‌: పొలార్డ్‌ (కెప్టెన్‌), లూయిస్, హోప్, హెట్‌మైర్, పూరన్, హోల్డర్, ఛేజ్, కీమో పాల్, కాట్రెల్, జోసెఫ్, పైర్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories