India vs Sri Lanka : భారత్ ఘన విజయం..

India vs Sri Lanka : భారత్ ఘన విజయం..
x
భారత్, శ్రీలంక సిరీస్
Highlights

శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్ 2-0తో భారత కైవసం చేసుకుంది. పుణె వేదికగా జరిగిన ఆఖరి టీ20లో శ్రీలంకను 123పరుగులకే ఆలౌట్ చేసి 78పరుగల తేడాతో భారత్...

శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్ 2-0తో భారత కైవసం చేసుకుంది. పుణె వేదికగా జరిగిన ఆఖరి టీ20లో శ్రీలంకను 123పరుగులకే ఆలౌట్ చేసి 78పరుగల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. అటు బౌలింగ్ లోను బ్యాటింగ్ లోనూ సమిష్టిగా ఆడి టీమిండియా గెలుపొందింది. శ్రీలంక బ్యాట్స్ మెన్స్ లో ధనుజయ డిసిల్వా (57, 36బంతుల్లో, 8 ఫోర్లు, 1 సిక్స్ ) టాప్ స్కోరర్ గా నిలిచాడు. సీనియర్ ఆటగాడు మ్యాథ్యుస్ (31) పరుగులు చేసిన రాణించాడు. 202 పరుగులతో భారీ లక్ష్య బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక జట్టు ఆదిలో నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ నేపథ్యంలో మ్యాథ్యుస్ , డిసిల్వా ఇద్దరు కలిసి శ్రీలంక ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కు 72పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ప్రమాదకరంగా మరి వీరి జోడిని భారత బౌలర్ వాషింగ్టన్ సుందర్ వీడదీశాడు. 12 ఓవర్ బౌలింగ్ చేసిన సుందర్ మ్యాథ్యుస్ ను ఔట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత వచ్చిన షనక(9), హసరంగ (0) లక్షణ్‌ సందాకన్‌ 1, వరుసగా టీమిండియా బౌలర్లను ఎదుర్కొనలేక తక్కువ పరుగులకే పెవిలియన్ దారి పట్టారు. భారత బౌలర్లలో నవదీప్ షైనీ మూడు వికెట్లు తీశాడు. సుందర్, శార్ధుల్ ఠాకుర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బుమ్రా ఒక వికెట్ దక్కించుకున్నాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంబించిన భారత్ భారీ 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత ఓపెనర్లు రాహుల్, ధావన్ ఇద్దరు లంక బౌలర్లను చీల్చిచెండాడారు. ఇద్దరు కలిసి తొలి వికెట్ తొలి వికెట్ కు 97 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ధావన్(52 పరుగులు, 36 బంతుల్లో, 7ఫోర్లు, 1 సిక్స్) వద్ద లక్షణ్‌ సందాకన్‌ బౌలింగ్ లో గుణతికకి క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. టీమిండియా ఇద్దరి భాగస్వామ్యానికి తెర పడింది. ధావన్ అవూటైన తర్వాత కుద్దిపైపటికికే రాహుల్ (54, 36బంతుల్లో, ఐదు ఫోర్లు, 1సిక్సు)తో లక్షణ్‌ సందాకన్‌ బౌలింగ్ లో ముందుకు వచ్చి ఆడబోయే ప్రయత్నంలో వికెట్ కీపర్ పెరీరా స్టంప్ చేశాడు. చాలా కాలంలో టీమిండియా ప్లేస్ కోసం ఎదురుచూస్తున్న శాంసన్ ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేశాడు.

కోహ్లీ స్థానంలో మూడో బ్యాట్స్ మెన్ గా వచ్చిన సంజు శాంసన్ నిరాశపరిచాడు.ఆతర్వాత వచ్చిన శ్రేయస్స్ అయ్యార్ కూడా వెంటనే వెనుదిరిగాడు. ఇక మ్యాచ్ లో కెప్టెన్ కోహ్లీ ఆరో బ్యాట్స్ మెన్ గా బరిలోకి దిగాడు, మనిష్ పాండే (31)తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామన్యం నెలకొల్పారు. కోహ్లీ, మనిష్ పాండే మధ్య సమన్వయ లోపం కారణంతో కోహ్లీ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. కాగా.. మనీష్ పాండేకు, శార్థుల్ ఠాకుర్( 22) జతకలవడంతో చివరి ఓవర్లలో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. దీంతో భారత్ భారీ విజయ లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. శ్రీలంక బౌలర్లలో లక్షణ్‌ సందాకన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. హసరంగా, కుమర తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. భారత సారథి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగవంతంగా 11వేల పరుగుల్ని సాధించిన కెప్టెన్ గా రికార్డు నమోదు చేసుకున్నాడు. అటు బంతితోను, బ్యాట్ తోను రాణించిన ఠాకుర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యా్చ్ ఎంపికైయ్యాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ నవదీప్ షైనీని వరించింది. ఇక భారత్ తన తదుపరి మ్యాచ్ జనవరి 14 ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories