India Vs Sri Lanka T20: నేడే భారత్‌ - శ్రీలంక మధ్య రెండో టీ20

* 3 టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో టీమిండియా * టీ20 సిరీస్‌పై కన్నేసిన గబ్బర్‌సేన

Sandeep Reddy
Published on: 27 July 2021 8:24 AM IST
India Vs Sri Lanka Second T20 Today 27 07 2021
X

శ్రీలంక, భారత్‌ మధ్య రెండో టీ20

India Vs Sri Lanka T20: శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ లో 2-1 తేడాతో వన్డే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా ఇటు టీ20 లోను అదే జోరును కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో విజయం సాధించిన టీం ఇండియా మంగళవారం జరగనున్న రెండవ టీ20 లో కూడా గెలిచి మరో మ్యాచ్‌ మిగిలుండగానే శ్రీలంకపై టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇక మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ భారత్, శ్రీలంక మధ్య రెండో టీ20 జరగనుంది. మంగళవారం జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.

ఇక ఇప్పటికే వన్డే సిరీస్ ని కోల్పోయిన లంక జట్టు ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఓడిపోతే స్వదేశంలో రెండు సిరీస్ లను కోల్పోనుంది. టీ20 సిరీస్ గెలవాలనే లంక ఆశలకు నేటి మ్యాచ్ చావో రేవో అని అర్ధం అవుతుంది. గత అయిదు టీ20 సిరీస్ లలో పాల్గొన్న శ్రీ లంక జట్టు ఇప్పటి వరకు ఒక్క సిరీస్ లో కూడా గెలుపొందలేదని రికార్డులు చెబుతున్నాయి. భారత జట్టు విషయానికొస్తే మొదటి టీ20 లో ఆడిన ఆటగాళ్ళతోనే రెండో టీ20 లోనూ బరిలోకి దిగనుంది. శ్రీలంక జట్టులో మాత్రం ఒకటి రెండు మార్పులు ఉండవచ్చని తెలుస్తుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story