INDvSL 2nd T20 : కాసేపట్లో టీ20 పోరు జట్ల బలాబలాలు ఇవే..

INDvSL 2nd T20 : కాసేపట్లో టీ20 పోరు జట్ల బలాబలాలు ఇవే..
x
India vs Sri Lanka
Highlights

తొలి టీ20 రద్దు కావడంతో..రెండో టీ20లో విజయం సాధించాలని అటు శ్రీలంక.. ఇటు భారత్ భావిస్తున్నాయి. రెండు జట్లు బోణీ కొట్టాలని ఊవిళ్లురుతున్నాయి.

కొత్త సంవత్సంరలో భారత క్రికెట్ జట్టు మైదానంలోకి అడుగుపెట్టాలని ఊత్సాహంతో ఉంది. కొత్త ఏడాదిని విజయంలో కొనసాగించాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీలంతో మూడు టీ20ల సిరీస్ లో ఇప్పటికే తొలి టీ20 రద్దయింది. గువహటి వేదిక తొలి టీ20లో మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. తొలి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. అయితే కొద్ది సేపటికే వర్షం మొదలవడంతో ప్లేయర్లంతా డ్రెసింగ్ రూమ్‌కే పరిమితం అయ్యారు. పిచ్ పరిశీలించిన అంపైర్లు మ్యాచు నిర్వహించడం సాధ్యం కాదని తేల్చి చేప్పారు. దీంతో మ్యాచ్ రద్దుయ్యినట్లు ప్రకటించారు. కొత్త సంవత్సరం విజయంతో ప్రారంభించాలనుకున్న టీమిండియాకు నిరాశే ఎదురైంది.

అయితే మంగళవారం ఇండోర్ వేదికగా రెండో టీ20లో టీమిండియా శ్రీలంకతో తలబడనుంది. ఈ మ్యాచ్ లో భారత జట్టు పెద్దగా మార్పులు చేసే అవకాశం కనిపించడంలేదు. గత మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండర్ స్పిన్నర్ జాడేజాను పక్కపెట్టి అతని స్థానంలో బౌలర్ సందీప్ షైనీకి అవకాశం కల్పించారు. శ్రీలంక కూడా జట్టలో కీలక మార్పు చేసింది. ఆ జట్టులో సినీయర్ ఆటగాడు మ్యాథుస్ ను రెస్ట్ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత టీ20 సిరీస్ లో ఆడుతున్న అతన్ని పక్కన పెట్టడంపై అది పటిష్టమైన భారత జట్టపై మ్యాచ్ లో పక్కన పెట్టడంపై కొందరు సినియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. శ్రీలంక జట్టులో రెండో మ్యాచ్ లో మార్పులు చేసే అవకాశం ఉంది.

ఈ సంవత్సరం టీ20 ప్రపంచ కప్ ఉండడంతో రెండు జట్లు ప్రత్యేక దృష్టి పెట్టింది. టీ20 ప్రపంచకప్ కైవసం చేసుకునే దిశగా అడుగులు వేయాలని భారత్ చూస్తుంది. ఈ ఏడాదిలో టీమిండియా అడనున్న తొలి సిరీస్ ఇదే. కాగా..గత సంవత్సరం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టీండీస్ పై వరుస విజయాలతో జోరు మీద ఉంది. శ్రీలంక జట్టు మాత్రం పాకిస్థాన్ పై జరిగిన టీ20 సిరీస్ లో విజయం సాధించినప్పటికీ తర్వాత ఆస్ట్రేలియాపై పరాజయం పాలైంది. ఈ సారి భారత్ పై రాణించి విజయంతో ఈ సంవత్సరాన్ని ఆరంభించాలని మలింగసేన యోచిస్తుంది.

భారత జట్టు మాత్రం కొంత కాలంగా కీలక ఆటగాళ్లు పలు సిరీస్ నుంచి విశ్రాంతి ఇస్తుంది. తాజాగా శ్రీలంక సిరీస్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చింది. ఈ సారి రోహిత్ బదులుగా శిఖర్ ధావన్ బరిలో దిగనున్నాడు. మరో ఓపెనర్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. ఈ సిరీస్ శిఖర్ ధావన్ కు అగ్ని పరీక్షగా మారనుంది. టీమిండియా స్పిడ్ గన్ బుమ్రా మళ్లి జట్టులోకి పునరాగమనం చేయనున్నాడు. వెస్టిండీస్ టెస్టు సిరీస్ లో గాయపడిన బుమ్రా వన్డే, టీ20 సిరీస్ కు దూరమైన సంగతి తెలిసిందే. తాజా సిరీస్ లో బుమ్రా జట్టులోకి రానున్నాడు.

భారత జట్టు బ్యాటింగ్ విషయానికి వస్తే జట్టులో భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ లేకపోయినప్పటీకి, రాహుల్ వరుస సిరీస్లో తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. వెస్టిండీస్ ఓపెనర్ గా భారీ ఇన్నింగ్స్ నెలకొల్పడంతో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా సెంచరీలతో అలరించాడు. తర్వాత కెప్టెన్ కోహ్లీ కూడా తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. టీ20ల్లో కోహ్లీ రికార్డు మెరుగ్గ లేకపోయినప్పటీకి గత ఏడాది టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. శ్రేయస్ప్ అయ్యార్. శివమ్ దూబే, జట్టు భారీ సోరు సాధించడంలో సహాయపడుతున్నాడు. గత కొంత కాలంగా పేలవ ఫామ్ కొనసాగిస్తున్న రిషబ్ పంత్ వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ లో మళ్లి ఫామ్ లోకి వచ్చాడు.

ఇక రెండో మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు కీలక సమయంలో 71పరుగులు చేసి అయ్యార్ తో ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆలౌరౌండర్ జాడేజా కూడా తనకు అవకాశం వచ్చినప్పుడు బ్యాట్ తో రాణిస్తున్నాడు. క్లీష్ట సమయంలో ఒత్తిడికి‌లోను కాకుండా టేయిలేండర్లతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దుతున్నాడు. వెస్టిండీస్ వన్డే సిరీస్ గెలవడంతో జడేజా పాత్ర మరిచిపోలేనిది. అయితే జాడేజాను తొలిటీ20లో పక్కన పెట్టిన విషయం తెలిసిందే. శ్రీలంకతో జరిగే సిరీస్ లో కూడా భారత బ్యాట్స్ మెన్ రాణిస్తే పరుగల వరద పారించడం ఖాయం. భారత జట్టు బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా పునరాగమనం పెద్ద బలం అనే చెప్పాలి. షమీకి విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో స్టార్ బౌలర్ బుమ్రా జట్టులోకి రావడం బౌలింగ్ బలం మరింత పెరిగింది. అయితే బుమ్రా‌ఫిట్ నెస్ పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సామర్థ్యం నిరుపించుకునేందుకు సరైన సమయం అని చెప్పాలి. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ కూడా రాణిస్తున్నారు. అయితే విండీస్ పై జరిగిన సిరీస్ లో భారీగా పరుగులు సమర్పించుకోవడం కాస్త ఆందోళనకు గురిచేసే అంశమే.

శ్రీలంక జట్టు విషయానికి వస్తే ఆగ్రశ్రేణి ఆటగాళ్లు రిటైర్మెంట్ తర్వాత ఆ జట్టు ద్వైపాక్షిక సిరీస్ లో గెలవలేదు. టీమిండియాపై జరిగిన మ్యాచ్లో ధీటూగా ఎదుర్కొనలేకపోయింది. జట్టులో సీనియర్ ఆటగాడు మలింగను టి20లకు సారథిగా ఎంపిక చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డు. అయితే మలింగ కొంత కాలంగా ఫామ్ అందుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు. వరసల సిరీస్ లు ఆడితే అతని కెప్టెన్సీలో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. శ్రీలంక జట్టు పటిష్టమైన భారత్‌ను ఓడించడం అంత సులువు కాదు. పాకిస్తాన్‌ను వారి సొంతగడ్డపై టి20 సిరీస్‌లో ఓడించింది. అయితే ఆ తర్వాత జరిగిన సిరీసుల్లో గెలుపు సొంత చేసుకోలేకపోయింది.

టీ20 జట్టులో చోటు పునరాగమనం చేసిన మాథ్యూస్‌ తమ ఉపకరిస్తుందని మలింగ అన్నాడు. అయినప్పటీకి గత మ్యాచ్ లో మ్యాథ్యూస్ పక్కన పెట్టారు. వర్షం కారణంగా గువహటి మ్యాచ్ రద్దయింది. అయితే నేటి మ్యాచ్ వర్షం పడే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో పిచ్ బ్యాటింగ్ అనుకూలం కావడంలో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. 2017లో శ్రీలంతో ఆడిన టీ20ల్లో భారత్ 88 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ తో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అనంతంరం బ్యాటింగు దిగిన శ్రీలంక 172 పరుగులు మాత్రమే చేయగలిగింది.

తది జట్ల అంచనా:

భారత్‌: విరాట్ కోహ్లి (కెప్టెన్‌), శిఖర్ ధావన్, కేఎల్. రాహుల్, శ్రేయస్స్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్‌ యాదవ్ ,సందీప్ షైనీ, శార్దుల్, బుమ్రా.

శ్రీలంక: లతీస్ మలింగ (కెప్టెన్‌), గుణతిలక, ఒషాడా ఫెర్నాండో, భానుక రాజపక్సా, అవిష్క ఫెర్నాండో, కుషాల్‌ పెరెరా, మాథ్యూస్‌/లహిరు కుమార, షనక, ఉడానా, హసరంగ, కసున్‌ రజిత.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories