IND vs SL: నేడు భారత్ - శ్రీలంక రెండో టీ20

India vs Sri Lanka 2nd T20 Match Today
x

IND vs SL: నేడు భారత్ - శ్రీలంక రెండో టీ20

Highlights

IND vs SL: ఇప్పటికే 1-0 ఆధిక్యంలో భారత్

IND vs SL: మరో సిరీస్‌పై టీమిండియా కన్నేసింది. నేడు పుణె వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే టీమిండియా 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఉత్కంఠ విజయంతో ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించిన టీమిండియా అదే జోరులో శ్రీలంకపై సిరీస్ కైవసం చేసుకోవాలని ఊవ్విళ్లూరుతోంది. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ పట్టేయాలని పాండ్యా సేన చూస్తుంటే సమం కోసం లంక ప్రయత్నిస్తుంది. మొదటి మ్యాచ్‌లో గాయపడిన సంజూ శాంసన్ స్థానంలో రాహుల్ త్రిపాఠి, హర్షల్ పటేల్ స్థానంలో హర్హదీప్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంజూ శాంసన్ ఈ సిరీస్‌కి దూరం కాగా అతని ప్లేస్‌లో జితేష్ శర్మను జట్టులో చేర్చారు. పుణె పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తూనే బ్యాటింగ్‌కూ అనుకూలిస్తుందని అంచనా.

Show Full Article
Print Article
Next Story
More Stories