India vs Sri Lanka: ఇవాళ శ్రీలంకతో భారత్ తొలి వన్డే

India vs Sri Lanka 1st ODI Cricket Match
x

India vs Sri Lanka: ఇవాళ శ్రీలంకతో భారత్ తొలి వన్డే

Highlights

India vs Sri Lanka: పటిష్టంగా టీమిండియా బ్యాటింగ్ లైనప్

India vs Sri Lanka: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు రోహిత్‌ సేన సిద్ధమైంది. ఇప్పటికే టీ ట్వంటీ సిరీస్‌ గెలిచి ఉత్సాహంగా ఉన్న భారత జట్టు. ఇవాళ గువాహటిలో శ్రీలంకతో తొలి వన్డే ఆడనుంది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ తిరిగి జట్టులో చేరడంతో టీమిండియా బ్యాటింగ్‌ లైనప్ పటిష్టంగా మారింది. శ్రీలంకతో వన్డే సిరీస్‌కు జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడని భావించినా గాయం కారణంగా దూరం కావడంతో భారత జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఆసియా కప్, టీ ట్వంటీ ప్రపంచకప్‌నకు దూరమైన బుమ్రా జనవరి 18 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్‌ పర్యటనకైనా అందుబాటులో ఉంటాడా, ఉండడా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. టీ ట్వంటీల్లో అద్భుతాలు చేస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌ వన్డేల్లోనూ సత్తా చాటాలని భావిస్తున్నాడు. ప్రపంచకప్‌నకు ముందు వన్డేల్లో తన సత్తా చాటాలని సూర్య పట్టుదలగా ఉన్నాడు. బౌలింగ్‌లో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లకు తుది జట్టులో స్థానం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ భారత్‌కు అదనపు బలాన్ని ఇవ్వనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories