Ind vs SA 3rd Test : విజృంభించిన భారత్ బౌలర్లు

Ind vs SA 3rd Test : విజృంభించిన భారత్ బౌలర్లు
x
Highlights

నాలుగు పరుగులకే తొలివికెట్ కోల్పోయింది. ఎల్గర్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. మరో ఓపెనర్ డికాక్‌ను ఉమేష్ పెవిలియన్‌కు దారి పట్టించాడు. జట్టు స్కోరు 8పరుగులకే ఇద్దరూ ఓపెనర్లు ఔట్ కావడంతో దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది.

రాంచీ వేధికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు భారత్ తొమ్మిది వికెట్లకు 497 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ ప్రకటించింది. టీ విరామం అనంతరం దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ ఆరంభించింది. నాలుగు పరుగులకే తొలివికెట్ కోల్పోయింది. ఎల్గర్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. మరో ఓపెనర్ డికాక్‌ను అతని వ్యక్తి గత స్కోరు నాలుగు పరుగుల వద్ద ఉండగానే ఉమేష్ పెవిలియన్‌కు దారి పట్టించాడు. జట్టు స్కోరు 8పరుగులకే ఇద్దరూ ఓపెనర్లు ఔట్ కావడంతో దక్షిణాఫ్రికా 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు 2వికెట్ల నష్టానికి తొమ్మిది పరుగులు చేసింది.

అంతకుముందు టీంమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ 255 బంతుల్లో 212 పరుగులు చేసి రాబడ బౌలింగ్ లో ఔటయ్యాడు. రహానే115పరుగులు చేసి లిండే బౌలింగ్‌లో ఔటయ్యాడు. జాడేజా 51 పరుగులతో ఆర్థశాతకాన్ని పూర్తి చేశాడు. టైలెండర్ల షాబాజ్ నదీమ్, మహ్మద్ షమీ క్రీజులో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్ రబాడ 3 వికెట్లు పడగొట్టాడు. జార్జ్ లిండే 4 వికెట్లు తీసుకున్నాడు.

టాస్ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే భారత్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది.మొదటి రోజు ఓపెనర్ మయాంక్ 10 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే రాబడ బౌలింగ్ లో ఎల్గర్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటైపోయాడు. పుజారాలను ఖాతా తెరవకుండా ఎల్బీడబ్యూతో పెవిలియన్ బాట పట్టాడు. కెప్టెన్ కోహ్లీ కూడా 12 పరుగులు చేసి ఔటైయ్యాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories