India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌.. యాడ్స్, వ్యూవర్‌షిప్‌లో రికార్డు బ్రేక్!

India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌.. యాడ్స్, వ్యూవర్‌షిప్‌లో రికార్డు బ్రేక్!
x
Highlights

India vs Pakistan: భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత హై వోల్టేజ్ పోరు.

India vs Pakistan: భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత హై వోల్టేజ్ పోరు. ఈ మ్యాచ్ కేవలం క్రీడా ఉత్కంఠకే కాకుండా.. వ్యాపార పరంగానూ భారీ స్థాయిలో ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా ఆదివారం జరిగిన ఇండియా–పాక్ మ్యాచ్.. ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయంను మరోసారి స్పష్టం చేసింది. మ్యాచ్ ప్రసారం చేసిన భారత బ్రాడ్‌కాస్టర్లు కేవలం 10 సెకన్ల ప్రకటనకు సుమారు 77 వేల అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.70 లక్షలు, పాకిస్థాన్ కరెన్సీలో రూ.2 కోట్లకు పైగా) వసూలు చేసినట్లు సమాచారం.

ఇండియా–పాక్ మ్యాచ్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ వీక్షకాదరణ ఉండటంతో యాడ్ స్లాట్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. మ్యాచ్ మొత్తం వ్యవధిలో సుమారు 50 నుంచి 55 నిమిషాల వరకు ప్రకటనలకు ప్రత్యేక సమయం కేటాయించబడింది. ప్రతి బ్రేక్ సమయంలో ప్రసారమైన ప్రకటనలు బ్రాడ్‌కాస్టర్లకు భారీ ఆదాయాన్ని అందించాయి. ముఖ్యంగా ఇన్నింగ్స్ బ్రేక్‌లు, టైమ్‌అవుట్‌లు, వికెట్ పడిన తర్వాత వచ్చే బ్రేక్‌లు ప్రకటన దారులకు అత్యంత విలువైనవిగా మారాయి.

మరోవైపు మ్యాచ్‌ శ్రీలంకలో జరగడంతో ప్రత్యక్షంగా చూసేందుకు భారత్ నుంచి ఎక్కువ మంది వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో టీవీలు, ఆన్‌లైన్‌లో లైవ్‌ స్ట్రీమింగ్‌లో మ్యాచ్ వీక్షించారు. ఇండియా–పాక్ మ్యాచ్‌కు 45.4 కోట్ల వ్యూస్‌ వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా, నమీబియాతో ఆడిన మ్యాచ్‌లకూ మంచి వ్యూస్‌ వచ్చాయి. భారత్-యూఎస్‌ఏ మ్యాచ్‌కు 26 కోట్ల వ్యూస్ రాగా.. భారత్-నమీబియా మ్యాచ్‌కు 24 కోట్ల వ్యూస్‌ వచ్చాయి. టీ20 ప్రపంచ కప్‌ 2026లో భారత్‌ మూడు విజయాలు సాధించి సూపర్ -8కి దూసుకెళ్లింది. లీగ్‌ స్టేజ్‌లో చివరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ ఆడనుంది.

క్రికెట్‌లో ఇతర మ్యాచ్‌లతో పోలిస్తే భారత్–పాక్ మ్యాచ్‌లకు ఎప్పుడూ భారీ మార్కెట్ ఉంటుంది. అభిమానుల ఆసక్తి, టీవీ రేటింగ్స్, డిజిటల్ వీక్షణ.. కలిపి ఈ పోరును ప్రకటనదారులకు ‘గోల్డెన్ ప్లాట్‌ఫామ్’గా మార్చేస్తాయి. అందుకే బ్రాండ్లు కూడా భారీ మొత్తాలు చెల్లించేందుకు వెనుకాడడం లేదు. మొత్తం మీద చూస్తే. ఈ మ్యాచ్ కేవలం మైదానంలోనే కాకుండా వ్యాపార రంగంలోనూ రికార్డు స్థాయి ప్రభావాన్ని చూపించింది. క్రికెట్, మార్కెటింగ్ కలయిక ఎంత శక్తివంతమో ఈ గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories