India vs New Zealand 2nd test Day 1: కోహ్లీసేన మారలేదు.. ఆట తీరు మారలేదు

India vs New Zealand 2nd test Day 1: కోహ్లీసేన మారలేదు.. ఆట తీరు మారలేదు
x
India VS NZ 2nd Test day 1
Highlights

క్రిస్ట్‌చర్చ్‌ హాగ్లీ ఓవల్‌ వేదికగా న్యూజిలాండ్‌ భారత్‌ రెండో టెస్టు తొలి రోజు ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ వికెట్‌ నష్టపోకుండా 63...

క్రిస్ట్‌చర్చ్‌ హాగ్లీ ఓవల్‌ వేదికగా న్యూజిలాండ్‌ భారత్‌ రెండో టెస్టు తొలి రోజు ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ వికెట్‌ నష్టపోకుండా 63 పరుగులతో తొలిరోజు ఆటను ముగించింది. ఓపెనర్లు లాథమ్(27; 65 బంతుల్లో 4 ఫోర్లు) టామ్ బ్లండెల్‌ (29; 73 బంతుల్లో 4 ఫోర్లు) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇద్దరు భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. 23 ఓవర్లపాటు బౌలింగ్ చేసిన భారత బౌలర్లు వికెట్ తీయడంలో విఫలమైయ్యారు.

అంతకుముందు టాస్ గెలిచిన కివీస్ భారత్ ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 242 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాట్స్‌మెన్ పృథ్వీషా(54 పరుగులు, 64బంతుల్లో, 8ఫోర్లు, 1 సిక్సు), పుజారా(54, 140 బంతుల్లో; 6×4), విహారి(55,70బంతుల్లో, 10 ఫోర్లు) అర్థ శతకాలతో రాణించారు. మరోసారి కెప్టెన్ కోహ్లీ(3) పరుగులతో విఫలమయ్యాడు. విగతా భారత బ్యాట్స్ మెన్ అంతా కివీస్‌ బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు.

బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఆదిలోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్(7) బౌల్ట్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 30 పరుగులకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మరో సారి న్యూజిలాండ్ కు అవకాశం ఇవ్వలేదు. పుజారాతో కలిసి ఓపెనర్ పృధ్వీషా ఇన్నింగ్స్ గాడిలో పెట్టారు. పృథ్వీ షా వన్డే మ్యాచ్ తలపించేలా బ్యాటింగ్ చేశాడు. కివీస్ బౌలర్లపై విరుచుపడ్డాడు. 47 పరుగులు వద్ద వాగ్నెర్ బౌలింగ్‌లో సిక్సర్‌ కొట్టి 60 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. జేమీసన్‌ బౌలింగ్‌లో భారీ షాట్ కు యత్నించి లేథమ్ చేతికి చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ(3) వెంటనే అవుటై తన పేలవ ఫామ్ కొనసాగించాడు.

రెండో సెషన్ ముందు భారత్ 85/2 తో పటిష్ట స్థితిలో ఉంది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ బ్యాట్స్ మెన్ కోహ్లీ, రహానే వెంట వెంటనే కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న హనుమవిహారి అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. విహారి సాధించిన ఆర్థసెంచరీలో 40 పరుగులు బౌండరీలతో సాధించడం విశేషం. పుజారాతో కలిసిన కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. టీ విరామానికి ఐదు వికెట్లు కోల్పోయి 194 పరుగులతో నిలిచింది. ఆ తర్వాత కివీస్‌ బౌలర్‌ జెమీసన్‌ ధాటికి వికెట్లు సమర్పించుకుంది. నిలకడగా ఆడుతున్న పుజారా జెమీసన్‌ బౌలింగ్‌లో వాట్లింగ్‌కు క్యాచ్‌ ఇచ్చి దొరికిపోయాడు. తొలి టెస్టులో రాణించిన పంత్‌(12) ఈ మ్యాచ్లో విఫలమైయ్యడు. రవీంద్ర జడేజా(9), ఉమేశ్‌ యాదవ్‌(0) జేమీసన్ బౌలింగ్ లో పెవిలియన్ చేరారు. చివరి నాలుగు వికెట్లును జేమీసన్‌ )తీయడం విశేషం. న్యూజిలాండ్ బౌలర్లలో జెమీసన్‌ (5/45), బౌల్ట్‌, సౌథీ తలా రెండు వికెట్లు తీయగా, వాగ్నెర్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories