టీమిండియా విజయానికి వారే కారణం

టీమిండియా విజయానికి వారే కారణం
x
కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌
Highlights

బ్లాక్‌క్యాప్స్‌పై జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కలిసొచ్చిన ఆక్లాండ్ ఈడెన్ పార్క్ మైదానంలో భారత్ సమిష్టిగా బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి 7 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది.

బ్లాక్‌క్యాప్స్‌పై జరిగిన రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కలిసొచ్చిన ఆక్లాండ్ ఈడెన్ పార్క్ మైదానంలో భారత్ సమిష్టిగా బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి 7 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. ఐదు టీ20ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యం సాధించింది. మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ టీమిండియా బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు.

గత మ్యాచ్‌కి ఈ మ్యాచ్‌కి టీమిండియా బౌలర్లలో చాలా మార్పు వచ్చిందని, వారు చక్కగా రాణించాడు. స్పిన్నర్స్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు అంటూ విలియమ్సన్ ప్రశంసించాడు. అయితే తమ బౌలర్లను అవమానపరచాలని కాదు, భారత్ బ్యాటింగ్ లైన్ప్ స్పిన్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తెలిపారు. బ్యాటింగ్ లో తాము 15-20 పరుగులు అదనంగా చేస్తే మ్యాచ్ మరోలా ఉండేదని భావిస్తు్న్నాట్లు తెలిపాడు. ఈ మ్యాచ్ క్రిడెట్ టీమిండియా బౌలర్లకు దక్కుతుందని అన్నాడు. కివీస్ బౌలర్లు ఆరంభంలోనే కీలక వికెట్లు పడగొట్టారు. అయినా టీమిండియాపై ఆధిపత్యం కొనసాగించలేకపోయారు.

రెండో టీ20లో కివీస్ నిర్ధేశించిన 133 పరుగుల లక్ష్యం ఏడు వికెట్ల తేడాతో అలవొకగా ఛేదించింది. మూడు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. మరో 15 బంతులు మిగిలి ఉండగానే విజయకేతనం ఎగరవేసింది. టీమిండియా ఓపెనర్ రాహుల్(57 పరుగులు, 50 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సులు) అజేయ అర్ధసెంచరీతో సత్తాచాటాడు. శ్రేయస్స్ అయ్యర్ (44పరుగులు, 33 బంతుల్లో 1ఫోరు, 3 సిక్సులు) రాణించాడు. కోహ్లీ(11), రోహిత్ శర్మ(8) పరుగులతో నిరాశపరిచారు. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన కివీస్ బ్యాట్స్‌మెన్స్ సిఫెర్ట్ (33),గుప్తిల్(33) టాప్ స్కోరర్స్‌గా నిలిచారు. రాస్ టేలర్ (18), విలియమ్సన్ (14) తక్కువ పరుగులు చేశారు. జడేజా నాలుగు ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. శివమ్ దూబే, బుమ్రా, శార్థుల్ ఠాకూర్ తలా ఓవికెట్ దక్కించుకున్నారు. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన కేఎల్ రాహుల్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్ లో 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇక మూడో టీ20 మ్యాచ్ సీడెన్ పార్క్ వేదికగా హామిల్టన్‌లో ఈనెల 29న బుధవారం జరగనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories