IND VS NZ 1st Test : కివీస్ బౌలర్లను అడ్డుకున్న ఫోర్త్ అంపైర్..తొలి రోజు మ్యాచ్‌పై సందిగ్ధం

IND VS NZ 1st Test : కివీస్ బౌలర్లను అడ్డుకున్న ఫోర్త్ అంపైర్..తొలి రోజు మ్యాచ్‌పై  సందిగ్ధం
x
IND VS NZ
Highlights

న్యూజిలాండ్‌ - భారత జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్‌ వెల్లింగ్టన్ వేదికగా ఆరంభమైంది. భోజన విరామం తర్వాత టెస్టు మ్యాచ్...

న్యూజిలాండ్‌ - భారత జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్‌ వెల్లింగ్టన్ వేదికగా ఆరంభమైంది. భోజన విరామం తర్వాత టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. అంతకు ముందు టీమిండియా బ్యాట్స్‌మెన్‌ తడబడుతున్నారు. కివీస్ బౌలర్లను ఎదుర్కొనడంలో పూర్తిగా విఫలమైయ్యారు. ప్రాక్టీస్ మ్యాచ్ లో రాణించిన టీమిండియా బ్యాట్స్ మెన్ తుది పోరులో తేలిపోయారు. కోహ్లే సేన కీలక వికెట్లను చేజార్జుకుంది. 101 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డింది. 41.1 ఓవర్‌లో హనుమ విహారి(7) జామీసన్‌ బౌలింగ్‌లో అవుటైయ్యాడు. ప్రస్తుతం వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(38; 108 బంతుల్లో 4x4) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మరోవైపు రిషబ్ పంత్ (10) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఐదు వికట్ల నష్టానికి 55 ఓవర్లలో 122 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లను వర్షం అడ్డుకుంది. దీంతో మ్యాచ్ కొద్దీసేపు నిలిచిపోయింది. ఈ రోజువర్షం వెలిసిన తర్వాత మ్యాచ్ కొనసాగడంపై సందిగ్ధం నెలకొంది. మూడో సెషన్ మాత్రమే ఉండటంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందేహం నెలకొంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories