India Vs New Zealand: సెమీ ఫైనల్‌లో టీమిండియా పరుగుల వరద

India Vs New Zealand Updates
x

India Vs New Zealand: సెమీ ఫైనల్‌లో టీమిండియా పరుగుల వరద

Highlights

India Vs New Zealand: 49సెంచరీలతో సచిన్ పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టిన కోహ్లీ

India Vs New Zealand: సెమీ ఫైనల్లో టీమిండియా పరుగుల వరద పారించింది. వాంఖడే స్టేడియం తడిసి ముద్దైంది. వరుస విజయాలతో జైత్ర యాత్ర కొనసాగిస్తున్న భారత్.. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ అధించిన శుభారంభానికి తోడు విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ల సెంచరీలతో చెలరేగడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. చివరి ఐదు ఓవర్లలో శ‌్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ రెచ్చిపోయి ఆడారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. న్యూజిలాండ్‌ ముందు 398 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు మంచి శుభారంభం దొరికొంది. ముఖ్యంగా రోహిత్ శర్మ.. చెలరేగాడు. దొరికిన బాలు దొరికట్టే బౌండరీలకు పంపాడు 47పరుగులు చేసి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. గిల్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 2వందల పరుగుల వరకు మరో వికెట్ పోకుండా ఆడారు. ఐతే గాయం కారణంగా గిల్ రిటైర్డ్ ఔట్ కావడంతో తర్వాత వచ్చిన ‌శ్రేయస్ కూడా క్రీజులో నిలదొక్కుకుపోయాడు. కోహ్లీ, శ‌్రేయస్ కలిసి బౌండరీలు పదుతూ సెంచరీలతో చెలరేగిపోయారు.

పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో సరికొత్త రికార్డు సృష‌్టించాడు. వన్డేలో 50వ సెంచరీ చేశాడు. దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీల చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు కోహ్లీ. ఇప్పటి వరకు 49సెంచరీలతో సచిన్ పేరిట ఉన్న ఆ ఘనతను.. తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేలో 50సెంచరీలు చేసిన క్రికెటర్గా చరిత్రను తిరగరాశాడు కోహ్లీ. అంతర్జాతీయ క్రికెట్‌లో వన్డే, టెస్టుల్లో కలిపి 79 సెంచరీలు చేశాడు. వన్డేలో సచిన్ సాధించిన ఈ ఘనతను అందుకోవడం ఇంకెవరి వల్ల కాదని అనుకున్నారు. కానీ తనదైన ఆటతో పరుగుల సునామీని సృష‌్టించి.. అరుదైన రికార్డును చేరుకున్నారు కో‌హ్లీ. ఐతే కోహ్లీ క్రియేట్ చేసిన ఈ హిస్టరీని చెరిపేయడం ఇప్పటంతలో ఇంకెవరికీ సాధ్యం కాదనే చెప్పాలి. మళ్లీ ఎదైన అద్భుతం జరిగితే తప్ప.

Show Full Article
Print Article
Next Story
More Stories