భారత్‌- ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్, మూడో రోజు ఇండియాదే పై చేయి

India vs England 4th Test Match India Team is Leading Third Day Match | Cricket Live Updates
x

భారత్‌- ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్

Highlights

Ind vs Eng: *టీమిండియా స్కోరు 270/3 *171 పరుగుల ఆధిక్యంలో భారత్ *రోహిత్ శర్మ 127, పుజారా 61 రాణించిన బ్యాట్స్‌మెన్న్

Ind vs Eng: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా మ్యాచ్‌పై పట్టు బిగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ స్కోరు మూడు వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది. దాంతో 171 పరుగుల ఆధిక్యంలో ఇండియా ఉంది. ఓపెనర్ రోహిత్ శర్మ 127 పరుగులు, పుజారా 61 పరుగులతో రాణించారు. ప్రస్తుతం కెప్టెన్ విరాట్ కోహ్లి 22 పరుగులు, రవీంద్ర జడేజా 9 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

మూడో వికెట్‌‌ భాగస్వామ్యంలో రోహిత్ శర్మ, పుజారా అద్భుతంగా రాణించారు. వీరిని ఒకే ఓవర్ రాబిన్‌సన్ పెవిలియన్ పంపి. భారత్‌కు షాక్ ఇచ్చాడు. 81వ ఓవర్‌లో ఫస్ట్ ఫుల్‌షాట్ ఆడిన రోహిత్.. క్రిస్‌వోక్స్ చేతికి చిక్కగా చివరి బంతికి పుజారా అనూహ్య బంతికి మొయిన్‌ అలీ చేతికి చిక్కాడు.. దాంతో టీమ్ ఇండియా ఒక్క పరుగు వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అనంతరం కోహ్లీ, జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అయితే. వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను కాస్త ముందుగానే నిలిపివేశారు. ఇక నాలుగో రోజు భారత బ్యాట్స్‌మెన్ భారీ స్కోరు సాధించడంపైనే జట్టు విజయావకాశాలు ఆధారపడ్డాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories