India vs England: చేతులేత్తిసిన భారత బౌలర్లు.. ఇంగ్లాండ్ ఘన విజయం

India Vs England 2nd Odi
x
Ind vs Eng ( ఇంగ్లాండ్ ట్విట్టర్ )
Highlights

India vs England:పుణె వేదికగా జరుగిన రెండో వన్డేలో భారత బౌలర్లు చేతులెత్తేశారు.

India vs England: పుణె వేదికగా జరుగిన రెండో వన్డేలో భారత బౌలర్లు చేతులెత్తేశారు.337 పరుగుల విజయలక్ష్యాన్నిఇంగ్లాండ్ సునాయాసంగా చేధించింది.బెయిర్‌ స్టో (124 పరుగులు,112బంతుల్లో,11ఫోర్లు,7సిక్సులు) విధ్వంసకర ఇన్నింగ్స్ తోడు...స్టోక్స్(99పరుగులు, 52బంతుల్లో, 4ఫోర్లు, 10సిక్స్)మెరుపు ఇన్నింగ్స్ తోడైంది. ఇక ఆఖర్లో లివింగ్‌స్టన్(27)‌, మలన్(16) లాంఛనాన్ని పూర్తి చేశారు. 43.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 337 పరుగలు చేసింది. దాంతో ఇంగ్లాండ్ ఆరు వికెట్లుతో విజయం సాధించింది. భారత బౌలర్లలో ప్రసిధ్ద్ రెండు వికెట్ల పడగొట్టగా..భూవనేశ్వర్ ఒక వికెట్ తీశాడు. దీంతో మూడు వన్డేల సిరీస్ ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఇక మూడో వన్డే ఈ నెల 28న ఇదే వేదికపై జరగనుంది.

భారీ లక్ష‌్యంలో ఇంన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లీష్ జట్టుకు ఓపెనర్లు శుభారాన్నిచ్చారు. జేసన్‌ రాయ్‌(55పరుగులు,52బంతుల్లో, 7ఫోర్లు,1సిక్స్)అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. బెయిర్‌ స్టోతో కలిసి తొలి వికెట్‌కు 110 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన 16 ఓవర్‌లో మూడో బంతిని ఆడిన బెయిర్‌ స్టో పరుగు ప్రయత్నిస్తున్న క్రమంలో రోహిత్‌ అద్భుత ఫీల్డింగ్‌తో కీపర్ పంత్‌కు బంతి అందించాడు. దీంతో పంత్ వికెట్లకు గిరాటవేయడంతో జేసన్‌ రాయ్(55) రనౌటయ్యాడు. బెయిర్‌ స్టో జతకలిసిన స్టోక్స్‌ భారత బౌలర్లను చీల్చిచెండారు. ఇరువురు కలిసి రెండో వికెట్ కు 175పరుగల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు చెత్త ప్రదర్శ చేశారు కుల్‌దీప్‌ ఈ వన్డేలో ఇప్పటికే 8 సిక్సర్లు ఇచ్చాడు. వన్డేలో ఒక భారత బౌలర్‌ ఎక్కువ సిక్సర్లు ఇవ్వడం 2011, జనవరి తర్వాత ఇదే తొలిసారి. 2013లో బెంగళూరులో ఆస్ట్రేలియా మ్యాచులో ఆర్‌.వినయ్‌ కుమార్‌ 7 సిక్సర్లు ఇచ్చాడు.

టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన భారత్ నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 336పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ముందు పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా ఇన్నింగ్స్‌లో రాహుల్ (108; 114 బంతుల్లో 7x4, 2x6) శతకం సాధించాడు. కెప్టెన్ కోహ్లీ (66; 79 బంతుల్లో 3x4, 1x6), పంత్‌(77 పరుగులు, 40 బంతుల్లో, 3ఫోర్లు,7సిక్సులు) అర్థ శతకాలతో రాణించారు. ఆఖర్లో హార్థిక్ పాండ్య (35,16బంతుల్లో) ధాటిగా ఆడాడు. దాంతో భారత్ ఇంగ్లాండ్ ముందు 337 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్‌కరన్, టాఫ్లీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, ధావన్ ఇన్నింగ్స్ ఆరంభించారు. తొలి వన్డేలో త్రుటిలో శతకం చేజార్చుకున్న ధావన్‌(4) రెండో వన్డేలో స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. టాప్లీ వేసిన నాలుగో ఓవర్‌ ఐదో బంతికి స్లిప్‌లో బెన్‌స్టోక్స్‌ చేతికి చిక్కాడు. దీంతో భారత్‌ 9 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. మరో ఓపెనర్ రోహిత్ తో కలిసి కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో సామ్‌కరన్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ నాలుగో బంతికి రోహిత్‌ శర్మ(25) ఔటయ్యాడు. స్క్వేర్‌ లెగ్‌లో అదిల్‌ రషీద్‌ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పొయాయింది.

రాహుల్ తో జతకలిసిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(66; 79 బంతుల్లో 3x4, 1x6) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 121 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమదకరంగా మారుతున్న వీరి జోడిని అదిల్‌ రషీద్‌ వీడదీశాడు. 32వ ఓవర్‌ చివరి బంతికి విరాట్‌ కోహ్లీ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. రాహుల్ నికలడగా ఆడగా.. పంత్ మాత్రం ఇంగ్లాండ్ బౌలర్లపై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సులు ఫోర్లతో విరుచుకుపడ్డారు. రాహుల్‌ శతకం బాది వన్డేల్లో ఐదో సెంచరీ నమోదు చేసుకున్నాడు. అనంతరం మరో ఏనిమిది పరుగులు జోడిండి 108 పరుగుల వద్ద ఔటయ్యాడు. ధాటిగా ఆడే క్రమంలో టామ్‌కరన్‌ బౌలింగ్ లో భారీ షాట్‌ ఆడి బౌండరీ వద్ద టాప్లీ చేతికి చిక్కాడు. రాహుల్ అవుటైనా పంత్ మాత్రం వెనక్కి తగ్గలేదు.

పాండ్య- పంత్ ఇరువురు కలిసి ఇంగ్లాండ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించారు. సామ్‌కరన్‌ వేసిన 46వ ఓవర్‌లో ఇద్దరూ కలిసి 21 పరుగులు రాబట్టారు. ఈ ఓవర్లు మూడు సిక్సులు బాదారు. పాండ్య రెండు సిక్సర్లు బాదగా, పంత్ ఒక సిక్సు సాధించాడు. ఈ క్రమంలో పంత్‌ 28 బంతుల్లో అర్ధశతకం సాదించి ఊపుమీద ఉన్నాడు. అయితే టామ్‌కరన్‌ వేసిన 47వ ఓవర్‌ ఐదో బంతికి భారీ షాట్‌ ఆడబోయి జేసన్‌ రాయ్‌ చేతికి చిక్కాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories