Ind Vs Eng Test: గట్టేక్కిస్తారా..!? అభిమానుల ఆశలు ఆ ఇద్దరిపైనే..

India Vs England 2021 2nd Test Match India Loss 3 Wickets to Low Score
x

అజింక్యా రహనే - చటేశ్వర పూజార (ట్విట్టర్ ఫోటో)

Highlights

India Vs England Test: భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజు బ్యాటింగ్ దిగిన భారత జట్టు తడబడుతూనే మ్యాచ్ ని మొదలుపెట్టింది. కేఎల్...

India Vs England Test: భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజు బ్యాటింగ్ దిగిన భారత జట్టు తడబడుతూనే మ్యాచ్ ని మొదలుపెట్టింది. కేఎల్ రాహుల్ 5, రోహిత్ శర్మ 21 పరుగులకు మార్క్ వుడ్ బౌలింగ్ లో ఔట్ అయి పెవిలియన్ బాట పట్టారు. 27 పరుగులకే రెండు వికెట్స్ కోల్పోయిన భారత్ జట్టుని కెప్టెన్ కోహ్లి ఆదుకుంటాడని అభిమానులు ఊహించిన సామ్ కర్రన్ వేసిన బంతికి కీపర్ క్యాచ్ తో బట్ల్లర్ చేతికి చిక్కి 20 పరుగులకే ఔటై అభిమానులను మరోసారి నిరాశ పరిచాడు.

ప్రస్తుతం లంచ్ విరామ సమయానికి భారత్ 56/3 తో ఇంగ్లాండ్ జట్టుపై 27 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం భారత జట్టు బ్యాటింగ్ లో అజింక్యా రహనే 1, చటేశ్వర పూజార 3 పరుగులతో గ్రీజులో ఉన్నారు. ఇక రెండో టెస్ట్ మ్యాచ్ భారత్ గెలువాలన్నా, కనీసం ఓటమి బారిన పడకుండా డ్రాగా ముగియాలన్న రహనే, పుజారా చేతుల్లోనే ఉందని క్రీడా పండితులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories