India vs England 1st ODI: నిలకడగా ఆడుతున్న భారత్

India vs England 1st ODI
x

India vs England 

Highlights

India vs England 1st ODI: ఓపెనర్ రోహిత్ శర్మ ఔటైన్పటికి భారత్ నిలకడగా ఆడుతుంది. ధావన్ ఈ మ్యాచ్ లో రాణిస్తున్నాడు.

India vs England 1st ODI: టెస్టు, టి20 సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌పై కన్నేసింది. ఇంగ్లాండ్-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ ఆరంభమైంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో రెండు జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ (England) ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (28పరుగులు, 42 బంతుల్లో, 4ఫోర్లు), శిఖర్ ధావన్ ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ నేపథ్యంలో వీరి జోడిని స్టోక్స్ వీడదీశాడు. స్టోక్స్ విసిరిన బంతిని అంచనా వేయలేని రోహిత్, కీపర్ బట్లర్ చేతికి చిక్కాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ (Kohli), ఓపెనర్ ధావన్ తో మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నాడు. ప్రస్తుతం కోహ్లీ (7*),ధావన్ (42) పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ 20 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. ఇంగ్లీష్ ప్లేయర్లలో స్టోక్స్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. తొలి టి20లో తర్వాత బెంచీకే పరిమితమైన శిఖర్‌ ధావన్‌ ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగారు. ఐదో టీ20లో రెగ్యూలర్ ఓపెనర్ రోహిత్ జోడిగా ఓపెనర్ అవతారమెత్తి ఆశ్చర్యపరిచిన కెప్టెన్ కోహ్లీ ఈ మ్యాచ్‎ లో మూడో నెంబర్ బ్యాట్స్ మెన్ గా బరిలోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌ ద్వారా టీమిండియా తరఫున కృనాల్‌ పాండ్యా, ప్రసీధ్‌ కృష్ణలు వన్డేల్లో అరంగేట్రం చేశారు.

ఇప్పటికే టీమిండియా తరఫున కృనాల్‌ టీ20లు ఆడగా, ప్రసీధ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌. కృనాల్‌ 233వ టీమిండియా వన్డే ప్లేయర్‌గా క్యాప్‌ అందుకోగా, ప్రసీధ్‌‌ 234వ ప్లేయర్‌గా క్యాప్‌ ధరించాడు. వీరిద్దరికీ కోచ్ రవిశాస్త్రి క్యాప్‌లు అందజేసి అభినందనలు తెలియజేశాడు. మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే England VS India 2021 వన్డే సిరీస్‌ నిర్వహించనున్నారు. మిండియా తరపున హార్దిక్ మరియు క్రునాల్ సోదరులుగా బరిలోకి దిగుతుండగా... ఇంగ్లాండ్ టీం నుంచి సామ్ మరియు టామ్ కుర్రాన్ లు సోదరలుగా బరిలో నిలిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories