India vs Bangladesh: పాకిస్తాన్ తో అంటే ఓకే.. ఇప్పుడు బంగ్లాదేశ్ తో కూడానా.. నో షేక్ హ్యాండ్ ప్లీజ్

India vs Bangladesh
x

India vs Bangladesh: పాకిస్తాన్ తో అంటే ఓకే.. ఇప్పుడు బంగ్లాదేశ్ తో కూడానా.. నో షేక్ హ్యాండ్ ప్లీజ్

Highlights

India vs Bangladesh: క్రికెట్ మైదానంలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారత్-బంగ్లాదేశ్ అండర్-19 మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు కరచాలనం (Handshake) చేసుకోకుండానే వెనుదిరిగారు. ఐపీఎల్ 2026 వివాదం మరియు ముస్తాఫిజుర్ రెహమాన్ ఇష్యూ ఈ పరిస్థితికి ఎలా దారితీసిందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

India vs Bangladesh: క్రికెట్ మైదానంలో క్రీడా స్ఫూర్తి కంటే దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో పాకిస్థాన్‌తో తలెత్తిన 'నో షేక్ హ్యాండ్' (No Handshake) వివాదం ఇప్పుడు బంగ్లాదేశ్‌తోనూ పునరావృతమైంది. జింబాబ్వే వేదికగా జరుగుతున్న అండర్-19 మ్యాచ్‌లో భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే, బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్‌తో కరచాలనం చేయడానికి నిరాకరించడం ఇప్పుడు క్రీడా లోకంలో సంచలనంగా మారింది.

ఏం జరిగింది?

క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో టాస్ సమయంలొ ఈ ఘటన చోటుచేసుకుంది. బంగ్లా కెప్టెన్ తమీమ్ అనారోగ్యంతో ఉండటంతో వైస్ కెప్టెన్ అబ్రార్ టాస్‌కు వచ్చాడు. టాస్ ప్రక్రియ ముగిసిన తర్వాత సాధారణంగా ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. కానీ ఆయుష్ మాత్రే కనీసం అబ్రార్ కళ్ళలోకి కూడా చూడకుండా పక్క నుండి వెళ్ళిపోయాడు. జాతీయ గీతాలాపన సమయంలో కూడా ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు పట్టించుకోకుండా గంభీరంగా వ్యవహరించారు.

వివాదానికి అసలు కారణం ఏంటి?

భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఇంతలా దెబ్బతినడానికి ఐపీఎల్ 2026 వేలమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ముస్తాఫిజుర్ ఇష్యూ: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) బంగ్లా ఆల్ రౌండర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కొనుగోలు చేసినప్పటికీ, బీసీసీఐ (BCCI) అతనిని ఆడనివ్వడానికి నిరాకరించింది. అతన్ని వెంటనే విడుదల చేయాలని కేకేఆర్ యాజమాన్యాన్ని ఆదేశించింది.

BCB ప్రతిస్పందన: దీనికి నిరసనగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం తమ జట్టును భారత్‌కు పంపమని తెగేసి చెప్పింది. తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది.

నిషేధం: బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది.

హిస్టరీ రిపీట్స్!

గతంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా కూడా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. రక్తం అంటిన చేతులను తాకలేమని బీసీసీఐ అప్పట్లో పాక్ కెప్టెన్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇప్పుడు అవే ఉద్రిక్తతలు బంగ్లాదేశ్‌తోనూ కనిపిస్తుండటం క్రికెట్ భవిష్యత్తుపై ఆందోళన కలిగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories