చారిత్రక డేనైట్ టెస్టుకు ముఖ‌్య అతిధులు ఎవరేవరంటే

Mamata And sheikh Hasina
x
Mamata And sheikh Hasina
Highlights

మూడు టీ20లు, రెండు టెస్టు సిరీస్ ల నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు భారత్ లో పర్యటించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఈ నెల 22వ తేదీ శుక్రవారం ఈడెన్...

మూడు టీ20లు, రెండు టెస్టు సిరీస్ ల నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు భారత్ లో పర్యటించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఈ నెల 22వ తేదీ శుక్రవారం ఈడెన్ గార్డెన్స్ వేధికగా కోల్ కతాలో జరగనుంది. మొదటి సారి భారత్ బంగ్లా జట్ల మధ్య జరగనున్న తొలి డే/నైట్ టెస్టు మ్యచ్. అయితే ఈ టెస్టును అంగరంగ వైభవంగా నిర్వహించాలని స్టార్ యాజమాన్యంతోపాటు బీసీసీఐ భావిస్తుంది.

ఈ నేపథ్యంలో డే/నైట్ మ్యాచ్ కు బంగ్లా ప్రధాని షేక్ హాసీనా హాజరు కానున్నట్లు సమాచారం. ఇదే మ్యాచ్ కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా హాజరుకానున్నారు. ఇరువురు చేతుల మీదగా మ్యాచ్ ప్రారంభమవుతుందని బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడు అభిషేక్ దాల్మియా తెలిపారు.

ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన గంగూలీ డే/నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించాలని అందుకు కెప్టెన్ కోహ్లీని , బంగ్లా క్రికెట్ బోర్డును కూడా ఒప్పించారు. ఈ క్రమంలో స్టార్ యాజమాన్యం ఈ మ్యాచ్ లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

22 జరిగే టెస్టు మ్యాచ్ కు స్టార్, బీసీసీఐ సంయుక్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పింక్ బాల్ మ్యాచ్ కు భారత క్రికెట్ టీమ్ కు సేవలందించిన కెప్టెన్లు, ఆటగాళ్లను ఆహ్వానించనుంది. మాస్టర్ బ్లాస్టార్ సచిన్ టెండ్యూలకర్, అలాగే టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, బాక్సింగ్ చాంపియన్ మేరికోమ్ సహా పలువురు ఆటగాళ్లు హాజరుకానున్నారు. గత దశాబ్ధంలో బంగ్లాదేశ్ భారత్ జట్లకు పాతినిధ్యం వహించిన ఆటగాళ్లు రానున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని వ్యాఖ్యాతగా కూడా ఈ వ్యవహరిస్తున్నారని ప్రచారం సాగుతోంది.

ఇప్పటి వరకు టీమిండియా బంగ్లాదేశ్ మధ్య రెండు టీ20 మ్యాచ్ లు జరిగాయి. ఢిల్లీ మ్యాచ్ లో బంగ్లా ఘన విజయం సాధించగా... రాజ్ కోట్ వేధికగా జరిగిన మ్యాచ్ భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ రోహిత్ విధ్వంసకర ఇన్నింగ్స్ తో బంగ్లా పులులపై చెలరేగిన విషయం తెలిసిందే. ఇరు జట్లు 1-1 గెలుపుతో సమానంగా నిలిచాయి. ఇక మూడో టీ20 నవంబర్ 10న విదర్భ వేధికగా నాగ్ పూర్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన వారినే టీ20 టైటిల్ వరిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories