ఆ కల నెరవేరలేదు : రోహిత్

Rohit sharma
x
Rohit sharma
Highlights

గుజరాత్‌లోని రాజ్‌కో‌ట్ వేధికగా బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో భారత్ జట్టు టీ20 తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా 26 బంతులు మిగిలి ఉండగానే ఏనిమిది వికెట్లతో బంగ్లాదేశ్ పై ఘనవిజయం సాధించింది.

మూడు టీ20లు రెండు టెస్టు మ్యాచ్ లో భాగంగా బంగ్లాదేశ్ జట్టు భారత్ లో పర్యటించింది. గుజరాత్‌లోని రాజ్‌కో‌ట్ వేధికగా బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో భారత్ జట్టు టీ20 తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా 26 బంతులు మిగిలి ఉండగానే ఏనిమిది వికెట్లతో బంగ్లాదేశ్ పై ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమానంగా నిలించింది. తొలి టీ20లో బంగ్లాదేశ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడో టీ20 ఈనెల పదినా విదర్భ క్రికెట్ స్టేడియం నాగ్ పూర్ లోజరుగుతోంది.

రెండో టీ20లో ఓపెనర్ గా బరిలోకి దిగిన రోహిత్ బంగ్లా బౌలర్ హుస్సేన్ వేసిన ఓవర్ లో ఏకంగా 21పరుగు చేశాడు. ఆ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ జోరు చూస్తే యువరాజ్ సింగ్ రికార్డు బద్దలు కొడతాడు అనే భావన అందరి లో కలిగింది. మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్ స్పందించాడు. మొసద్దిక్ హుస్సెన్ ఓవర్లో వరుసగా ఆరు సిక్సులు కొట్లాలని తెలిపారు. మూడు సిక్సర్లు వరుసగా కొట్టాక డాట్ బాల్ పడిందని తెలిపాడు. దీంతో ఓకే ఓవర్ లో ఆరు సిక్స్ లు సాధించాలనే కల నేరవేరలేదని తెలిపాడు.

2007లో ఇంగ్లాండ్ లో జరిగిన టీ20 మ్యాచ్ సందర్భంగా స్టువార్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు సాధించాడు. గురువారం జరిగిన మ్యాచ్ లో బంగ్లాపై రోహిత్ ఆరు సిక్స్ లు కొడితే యువరాజ్ సింగ్ రికార్డు బద్దలైయేది. కానీ, ఓకే ఓవర్లలో ఆరు సిక్స్ లు సాధించాలన్న రోహిత్ శర్మ కల మూడో టీ20 మ్యాచ్ లోనైన నెరవేరుతుందో లేదో చూద్దాం. రోహిత్ అభిమానులు మాత్రం యువరాజ్ రికార్డు బద్దలు కొడతాడని విశ్వాసం వ్యక్తం చేేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories