
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న డే/నైట్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ రెండో రోజు భారత జట్టు సారథి కోహ్లీ ( 101పరుగులు, 159 బంతులు,12 ఫోర్లు)...
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న డే/నైట్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ రెండో రోజు భారత జట్టు సారథి కోహ్లీ ( 101పరుగులు, 159 బంతులు,12 ఫోర్లు) బంగ్లాదేశ్ బౌలర్లపై చెలరేగిపోయాడు. కోహ్లీ తన టెస్ట్ కెరీర్ 27వ శతకం నమోదు చేశాడు. ఓవర్ నైట్ స్కోరు 174/3తో శనివారం ఆటను కొనసాగించిన భారత్ అజింక్య రహానె( 51పరుగులు, 69బంతులు, ఏడు ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. ఇస్లామ్ బౌలింగ్‌లో హుస్సెన్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. నాలుగో వికెట్‌కు కోహ్లీతో కలిసి 99 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. మరో వైపు జాడేజా 7 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 68 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు 257/4 తో ఉంది. బంగ్లాపై 151 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
మొదటి రోజు తొలి ఇన్నింగ్స్‌తో బంగ్లాదేశ్ 106 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు ధాటికి బంగ్లా బాట్స్ మెన్స్ పెవిలియన్ కి క్యూ కట్టారు. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం ఒక్కడే 29 పరుగులు చేసి టాప్ లో నిలిచాడు. బంగ్లా బాట్స్ మెన్స్ లో నలుగురు డకౌట్ అయ్యారు. భాతర బౌలర్లలో ఇషాంత్ శర్మ ఐదు వికెట్లు తీయగా, ఉమేశ్ యాదవ్ మూడు, షమీ రెండు వికెట్లు తీసుకున్నారు.
The #RunMachine at it again 👏💪@imVkohli brings up his 27th Test 💯#PinkBallTest #INDvBAN pic.twitter.com/rL4wDIdKsK
— BCCI (@BCCI) November 23, 2019

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




