Ind vs Ban 2nd Test : విజృంభిస్తున్న భారత బౌలర్లు

India vs Bangladesh 2nd Test
x
India vs Bangladesh 2nd Test
Highlights

ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ భారత్ మధ్య చరిత్రాత్మక డే-నైట్ టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. తొలుత టాస్ గెలిచి బంగ్లా బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి...

ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ భారత్ మధ్య చరిత్రాత్మక డే-నైట్ టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. తొలుత టాస్ గెలిచి బంగ్లా బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ ప్రాంభించిన బంగ్లాకు ఆదిలోనే షాక్ తగిలింది. 15 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. బంగ్లా ఓపెనర్ ఇమ్రుల్ కయోస్ 15బంతులు ఆడి 4పరుగులు చేసి ఏడో ఓవర్‌లోనే టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ మొమినుల్ హాక్ ఉమేష్ బౌలింగ్ లో పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. మిథున్ ను కూడా ఉమేష్ ఔట్ చేశాడు.

రహీమ్‌కు మహ్మద్ షమీ బౌలింగ్‌లో బంతిని వికెట్లని ఆడుకుని క్లీన్ బౌల్డయ్యాడు. 13 ఓవర్లకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఇస్లామ్(29 బ్యాటింగ్ 52 బంతుల్లో 5x4) ఉమేశ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ భారత బౌలర్ల ధాటికి పేకమేడలా వికెట్లు కోల్పోయింది. 19 ఓవర్లు ముగిసే సరికి బంగ్లా 60 పరుగులకు 5 వికెట్లు నష్టపోయింది. మహ్మదుల్లా 6, లిప్టన్ దాస్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories