Ind vs Ban 2nd Test ; కుప్పకూలిన బంగ్లా టాప్ ఆర్డర్

Ind vs Ban  2nd Test ; కుప్పకూలిన బంగ్లా టాప్ ఆర్డర్
x
Ind vs Ban 2nd Test
Highlights

ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ భారత్ మధ్య చరిత్రాత్మక డే-నైట్ టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. తొలుత టాస్ గెలిచి బంగ్లా బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి...

ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ భారత్ మధ్య చరిత్రాత్మక డే-నైట్ టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. తొలుత టాస్ గెలిచి బంగ్లా బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ ప్రాంభించిన బంగ్లాకు ఆదిలోనే షాక్ తగిలింది. 15 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. బంగ్లా ఓపెనర్ ఇమ్రుల్ కయోస్ 15బంతులు ఆడి 4పరుగులకే టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం బ్యాటింగ్ వచ్చిన కెప్టెన్ మొమినుల్ హాక్ ఉమేష్ బౌలింగ్ లో పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు.మిథున్ ను కూడా ఉమేష్ ఔట్ చేశాడు. రహీమ్‌ షమీ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. దీంతో బంగ్లా 26 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఇస్లామ్(21), మహ్మదుల్లా క్రీజులో ఉన్నారు. భాతర బౌలర్లలో ఉమేష్ రెండు వికెట్లు తీసుకోగా, ఇషాంత్, షమీ చెరో వికెట్ దక్కించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories