India vs Bangladesh 1st-test ; ముగిసిన తొలి రోజు ఆట.. ఆధిపత్యం భారత్‌

India vs Bangladesh 1st-test ; ముగిసిన తొలి రోజు ఆట..  ఆధిపత్యం భారత్‌
x
Highlights

తొలి రోజు మొదటి ఇన్నింగ్స్ ఆట ముగిసే సమయానికి భారత్ 86/1(26 ఓవర్లు) పరుగులు చేసింది. మూడో సెషన్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది.

బంగ్లాదేశ్ భారత్ మధ్య రెండు టెస్టుల సిరీస్ లో తొలి టెస్ట్ మ్యాచ్ గురువారం ప్రారంభమైంది. తొలి రోజు మొదటి ఇన్నింగ్స్ ఆట ముగిసే సమయానికి భారత్ 86/1(26 ఓవర్లు) పరుగులు చేసింది. మూడో సెషన్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. జట్టు 14 పరుగుల వద్ద రోహిత్ జాయద్ బౌలింగ్‌లో లిప్టన్ దాసుకు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (37పరుగులు, 81 బంతుల్లో 4 ఫోర్లు ) అజేయంగా నిలిచాడు. రోహిత్ ఆవుటైనా తర్వాత బరిలోకి వచ్చిన చెతేశ్వర్ పుజారా(43 పరుగులు 61 బంతుల్లో 7 ఫోర్లు ) క్రీజులో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో జాయేద్ ఒక వికెట్ తీశాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించడానికి భారత్ మరో 64 పరుగులు వెనుకబడివుంది.

అంతకుముందు టాస్ గెలిచిన బంగ్లా సారథి మొమినుల్ హక్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే తొలి ఇన్నింగ్స్ మొదటి సెషన్ ఆరంభంలోనే ఒపెనర్లు షాద్‌మాన్ ఇస్లామ్, ఇమ్రూల్ ఖయ్యూస్ డబుల్ డిజిట్ కూడా చేయలేదు దీంతో జట్టు స్కోరు 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అత్యల్ప స్కోరుకే బంగ్లా ఆలౌటైంది. భారత బౌలర్ల ధాటికి 150 పరుగులకే కుప్పకూలిపోయింది. బంగ్లా బ్యాట్స్‌మెన్స్‌లో ముష్ఫికర్ రహీమ్ 105 బంతులు ఎదుర్కొని 43 పరుగులు సాధించాడు. బంగ్లా టెస్టు కెప్టెన్ మొమినుల్ హక్ 37 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్స్ అంతా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ దారి పట్టారు. దీంతో స్పల్ప స్కోరుకే ఆలౌటైయింది. అనంతరం బరిలోకి దిగిన మహ్మద్ మిథున్(13)ని మహ్మద్ షమీ ఔట్ చేశాడు. 18 ఓవర్లు 31/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. నాలుగో వికెట్‌కు ముష్ఫికర్ రహీమ్(43 పరుగులు, 4 ఫోర్లు, 1 సిక్సర్) తో కలిసి కెప్టెన్ మొమినుల్ హక్ (37, 80 బంతుల్లో,6 ఫోర్లు) వికెట్‌కి 68 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.


రహీమ్‌ను షమీ ఆవుట్ చేయగా తర్వాత బంతికి మెహిదీ హసన్‌ను డక్‌గా ఔట్‌ చేశాడు. టీ విరామ అనంతరం ఇషాంత్‌ వేసిన తొలి ఓవర్‌ మొదటి బంతికే లిటాన్‌ దాస్‌(21) ఔట్‌ చేశాడు. దీంతో ఇద్దరూ కలిసి హ్యట్రిక్ నమోదు చేశారు. మొమినుల్ హక్ జట్టు స్కొరు 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. అనంతరం రహీమ్ అవుట్ కావడంతో తర్వాత బ్యాట్స్ మెన్లు ఎవరు రాణించలేదు. దీంతో బంగ్లా 150 పరుగలకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో షామీ మూడు వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్ , ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories