సమం చేస్తారా..? చేతులెత్తేస్తారా..?

సమం చేస్తారా..? చేతులెత్తేస్తారా..?
x
India Vs Ausis
Highlights

మూడు వన్డేల సిరీస్ లో రెండో వన్డే జరగనుంది. విజయం కోసం భారత్ పరితపిస్తుంది. ఈ వన్డేలో గెలిచి సిరీస్ ముడో వన్డేకు ముందుగానే సమం చేయాని భారత్ భావిస్తుంది.

భారత్ ఆస్ట్రేలియా మధ్య ఇవాళ రసవత్తరపోరుకు జరగనుంది. మూడు వన్డేల సిరీస్ లో రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ లో ఆసీస్ గత మ్యాచ్ ఫలితాన్నే పునరావృతం చేయాలని చూస్తుంటే. భారత్ ఈ మ్యాచ్ లో విజయం సాధించి 1-1 సమం చేయాలని చూస్తుంది. దీంతో ఈ సారి క్రికెట్ అభిమానులకు ఈ మ్యాచ్ మాజాను ఎంజాయ్ చేయాలని చూస్తున్నారు.

రాజ్ కోట్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో మరో విజయం ఖాతాలో వేసుకోవాలి ఆసీస్ ఉవ్విళ్లురుతుంటే.. ఈ సారి వన్డేలో ఆసీస్ గెలిచే అవకాశం ఇవ్వకుడదని టీమిండియా భావిస్తుంది. గత మ్యాచ్ లో జరిగిన తప్పిదాలను సరిచేసుకోవాలి కోహ్లీ సేన చూస్తుంది. 50 ఓవర్లు ఆడకుండానే గత మ్యాచ్ లో చేతులు ఎత్తేసింది. ఆసీస్‌ ఓపెనర్లిద్దరే మ్యాచ్ ముగించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి జట్టులో బ్యాటింగ్ ఆర్డర్ లో కీలక మార్పులకు భారత్ శ్రీకారం చుట్టనుంది.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అతనికి కలిసోచ్చిన మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగేందుకు సిద్ధమైయ్యాడు. భారత్ మిడిల్ ఆర్డ్ పటిష్టంగా లేకపోవడంతో నాలుగో స్థానంలో రాహుల్ పంపే అవకాశం ఉంది. ఓపెనర్లగా రోహిత్, ధావన్‌ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ స్థానంలో కేదార్‌ జాదవ్‌ కొనసాగించే అవకాశం ఉంది. మరో బౌలర్ తీసుకోవాలని భారత్ ఆలోచించడం లేదు.

ఈ మ్యాచ్ లో 'హిట్‌మ్యాన్‌' రోహిత్‌ శర్మ రాణిస్తే మ్యాచ్ ఫలితం మరోలా ఉంటుంది. ధావన్ ఫామ్ లో ఉండడం భారత్ కలిసోచ్చే అంశం. కేఎల్ రాహుల్‌ తనదైన శైలిలో రాణిస్తున్నాడు. రోహిత్‌ శర్మ బ్యాట్‌ నుంచి పరుగుల వరద పారితే.. మిడిల్ ఆర్డర్‌ భాద్యతను కూడా కెప్టెన్‌ కోహ్లి బ్యాటింగ్‌ను నడిపించే బాధ్యత తీసుకుంటాడు. భారత్ భారీ స్కోరు చేసే అవకాశం ఉంది.

సినీయర్ బౌలర్లు షమీ, బుమ్రా,లతో పాటు స్పిన్నర్లు కుల్దీప్, జడేజా తమ సత్తాచాల్సి ఉంది. గత మ్యాచ్ లో కీలక బౌలర్లు చేతులేత్తేశారు. బౌలింగ్ ప్రదర్శనపై అనుమానాలు ఉన్నాయి.

మరోవైపు తొలి వన్డే విజయంతో ఆసీస్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో వుంది. అదే జోరును పునరావృతం చేసి రెండో వన్డేలో విజయం సాధించాలని చూస్తుంది. ఓపెనర్లు వార్నర్, ఫించ్‌ భీకర ఫామ్‌తో దూకుడుగా ఉన్నారు. గత మ్యాచ్ లో ఆస్ట్రేలియా బౌలింగ్‌ విభాగం అద్బుత ప్రదర్శన చేసింది. స్టార్క్, పాట్ కమిన్స్, కేన్‌ రిచర్డ్‌సన్‌ టీమిండియా బ్యాట్స్ మెన్లను వణికించారు.

పిచ్

ఇక ఈ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. టాస్‌ నెగ్గిన జట్టు లక్ష్య ఛేదనకే మొగ్గుచూపే అవకాశంఉంది.

భారత్‌:

శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ కేఎల్‌ రాహుల్‌( వి) , విరాట్‌ కోహ్లీ (3), శ్రేయన్‌ అయ్యర్‌, జాదవ్, రవీంద్ర జడేజా, శార్జూల్‌ ఠాకూర్‌, కుల్‌దీవ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, జన్రీత్‌ బుస్రూ

ఆస్టేలియా:

డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌ (3), మార్నన్‌ లబుషేన్‌, న్టీవ్‌ స్మిత్‌, ఆస్టన్‌ టర్నర్‌, అలెక్స్‌ కేరీ (వి), ఆస్టన్‌ ఏగర్‌, కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌ రిచర్డ్‌సన్‌, ఆడమ్‌ జంపా

Show Full Article
Print Article
Next Story
More Stories