ఆస్ట్రేలియాపై రోహిత్, ధావన్ రికార్డు సృష్టిస్తారా..?

ఆస్ట్రేలియాపై రోహిత్, ధావన్ రికార్డు సృష్టిస్తారా..?
x
రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌
Highlights

టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌ తొలి వన్డేలో ఓ అరుదైన రికార్డుపై గురిపెట్టారు.

శ్రీలంకతో జరిగిన మూడు టీ20లో సిరీస్ 2-0తో కైవసం చేసుకుని ఈ ఏడాది విజయంతో ఆరంభించిన టీమిండియా మంగళవారం నుంచి మరో సమరానికి సిద్ధం కానుంది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ముంబైలోని వాఖండే వేదికగా ప్రారంభం కానుంది. కంగారులపై జరిగే ఈ సమరంలో భారత్ మరో సిరీస్ విజయంపై కన్నేసింది. మంగళవారం ఇరుజట్ల మధ్య తొలి వన్డే మధ్యాహ్నం 1.30 గంటలకు ఆరంభం కానుంది.

ఇక శ్రీలంక సిరీస్ కి టీమిండియా వైస్‌ కెప్టెన్‌ హిట్‌మ్యాన్‌ ఓపెనర్ రోహిత్‌ శర్మ విశాంత్రినిచ్చారు. అయితే సొంత మైదనాంలో ఆస్ట్రేలియాతో జరబోయే తొలి వన్డేతో రోహిత్ తిరిగి జట్టులో చేరనున్నాడు. సోమవారం నుంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. మరోవైపు హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ మరో 56 పరుగులు చేస్తే వేగవంతంగా 9వేలు పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్ గా రికార్డు నెలకొల్పనున్నాడు. 221 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 8,944 పరుగులతో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరబోయే మూడు వన్డే్ల్లో రోహిత్ మరో 56 చేస్తే 9వేల పరుగులు సాధించిన క్రికెటర్ గా రికార్డు సృష్టిస్తాడు. కోహ్లీ 194 ఇన్నింగ్స్ లో 9వేల పరుగులు చేశాడు. సౌతాఫ్రికా ఆటగాడు డివిలియర్స్ 205 వన్డేల్లో ఈ ఘనత సాదించాడు. మాజీ కెప్టెన్ బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ 228 వన్డేల్లో ఈ రికార్డు అందుకున్నాడు.

టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌ తొలి వన్డేలో ఓ అరుదైన రికార్డుపై గురిపెట్టారు. రోహిత్‌-ధావన్‌ ఇద్దరు కలిసి ఆస్ట్రేలియాపై సెంచరీ భాగస్వామ్యం చేస్తే వన్డేల్లో ఆస్ట్రేలియా వేదికగా అత్యధిక సెంచరీ పార్ట్నషిప్ సాధించిన జోడీగా చరిత్ర సృష్టిస్తారు. ఇప్పటి వరకు ఈ రికార్డు వెస్టిండీస్ ఓపెనర్లు గ్రీనిడ్జ్‌-హేన్స్‌ భారత్‌పై 6 సెంచరీల భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డు సృష్టిచారు. కాగా.. ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్ లో కలిసి రోహిత్‌-ధావన్‌ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పితే ఆ రికార్డు అధికమిస్తారు.

ఆస్ట్రేలియాపై రోహిత్-ధావన్‌లకు అదిరిపోయే రికార్డు ఉంది. ఇద్దరు కలిసి ఆస్ట్రేలియాపై 22 ఇన్నింగ్స్‌ల్లో 1,270 పరుగులు సాధించారు. భారత్ తరపున మిడిల్ ఆర్డర్ లో ధోని- యూవరాజ్ సింగ్ కలిసి పాకిస్థాన్ పై ఆరు సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయిన ధావన్ శ్రీలంకపై ఫామ్ లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాతో భారత్ ముంబై వేదికగా మంగళవారం తొలి మ్యాచ్ ఆడనుంది. రెండో వన్డే మ్యాచ్ జనవరి 17న రాజ్‌కోట్‌లో, మూడో వన్డే జనవరి 19న బెంగళూరు జరగనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories