India vs Australia: భారత్ , ఆసీస్ సిరీస్ పై సందిగ్థం.. సిరీస్‌ను బహిష్కరించే యోచనలో టీమిండియా‌?

India vs Australia: భారత్ , ఆసీస్ సిరీస్ పై సందిగ్థం.. సిరీస్‌ను బహిష్కరించే యోచనలో టీమిండియా‌?
x
Highlights

బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన మూడో టెస్టుకు ముందు అనూహ్య పరిణామాలు చోటుచేసుకునంటున్నాయి.

బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన మూడో టెస్టుకు ముందు అనూహ్య పరిణామాలు చోటుచేసుకునంటున్నాయి. దీంతో సిరీస్‌లో మిగిలిన 2 మ్యాచ్‌లు సజావుగా సాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియా, భారత్‌ జట్లు మూడో టెస్టుకు వేదికైన సిడ్నీకి మెల్‌బోర్న్‌ నుంచి సోమవారం బయల్దేరనున్నాయి. కరోనా రెండో దశ ప్రభావం అక్కడ ఎక్కువగానే ఉన్నప్పటికీ.. క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) మాత్రం మూడో టెస్టును అక్కడే నిర్వహించాలనే పట్టుదలతో ఉంది.

కాగా.. ఈ మ్యాచ్‌ తర్వాత ఆఖరి టెస్టు కోసం క్వీన్స్‌లాండ్‌ రాష్ట్రంలోని బ్రిస్బేన్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ క్వీన్స్‌లాండ్‌లో కోవిడ్ వ్యాప్తి పెరగకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రంతో సరిహద్దులను క్వీన్స్‌లాండ్‌ ఇప్పటికే మూసేసింది. కానీ, క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) విజ్ఞప్తి మేరకు రెండు జట్లకు ప్రత్యేక అనుమతినిచ్చింది. కానీ అక్కడికి వెళ్లాక ఆటగాళ్లు మరోసారి క్వారంటైన్‌ తరహా కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో హోటల్‌ నుంచి గ్రౌండ్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అందుకే టీమిండియా ఆఖరి టెస్టును బ్రిస్బేన్‌లో కాకుండా సిడ్నీలోనే నిర్వహించాలని కోరుకుంటోంది. ఐపీఎల్‌-13 ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు.. ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చారు. అయితే ఆస్ట్రేలియా నిబంధనలకులోబడి 14 రోజుల కఠిన క్వారంటైన్‌లో గడిపారు. ఇప్పుడు సిరీస్‌ ముగిసే ముందు మరోసారి క్వారంటైన్‌ అంటే కోప్పుకునేది లేదని భారత వర్గాలు అంటున్నాయి. ఒకవేళ తప్పనిసరిగా బ్రిస్బేన్‌లోనే ఆడాలంటే సిరీస్‌ను బహిష్కరించే యోచనలో భారత్‌ ఉన్నట్లు చెబుతున్నారు. హోటల్‌కే పరిమితం కావాలంటే బ్రిస్బేన్‌కు వెళ్లేందుకు సుముఖంగా లేమని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. రెండు టెస్టులు ఆడి తిరిగి స్వదేశం బయల్దేరేందుకు ఇబ్బంది లేదు అని స్పష్టం చేశాయి. దీనిపై ఆస్ట్రేలియా క్రికెట్ (సీఏ) తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories