Ind vs Aus: భారత్ ఆస్ట్రేలియా మధ్య రెండు రోజులు రెండు మ్యాచ్ లు.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు

India vs Australia High Voltage Two-Day Clash to Excite Fans
x

Ind vs Aus: భారత్ ఆస్ట్రేలియా మధ్య రెండు రోజులు రెండు మ్యాచ్ లు.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు

Highlights

Ind vs Aus: ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Ind vs Aus: ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ లు ఎప్పుడూ హై వోల్టేజీతో నిండి ఉంటాయి. క్రికెట్ అభిమానులు ఆసక్తికర మ్యాచ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సారి ప్రత్యేకత ఏంటంటే క్రికెట్ అభిమానులు మార్చి 4న, మార్చి 5న రెండ్రోజులు ఈ హై వోల్జేజీ మ్యాచ్ లను చూసే అవకాశం లభించింది. ఈ మ్యాచ్ కూడా చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతోంది. ఈ మ్యాచ్‌లో చాలా పెద్ద ఆటగాళ్లు ఆడబోతున్నారు.

భారత్, ఆస్ట్రేలియా మధ్య మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ ఈరోజు అంటే మార్చి 4న దుబాయ్‌లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. మార్చి 5న భారతదేశంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025లో ఈ రెండు దేశాల మధ్య ఒక మ్యాచ్ జరుగుతుంది. ఈ లీగ్‌లో రిటైర్డ్ క్రికెటర్లు ఆడుతున్నారు. దీనిలో భారతదేశం తరపున ఇండియా మాస్టర్స్ జట్టు , ఆస్ట్రేలియా తరపున ఆస్ట్రేలియా మాస్టర్స్ జట్టు ఆడుతున్నాయి.

సచిన్ టెండూల్కర్ నాయకత్వం వహిస్తున్న ఇండియా మాస్టర్స్ జట్టులో భారత్ తరఫున చాలా మంది గొప్ప ఆటగాళ్ళు ఆడుతున్నారు. ఈ లీగ్‌లో సచిన్‌తో పాటు ఇర్ఫాన్ పఠాన్, యువరాజ్ సింగ్, యూసుఫ్ పఠాన్ కూడా ఆడుతున్నారు. మరోవైపు, షేన్ వాట్సన్ ఆస్ట్రేలియా మాస్టర్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. షాన్ మార్ష్, బెన్ కటింగ్, డాన్ క్రిస్టియన్, బెన్ హిల్ఫెన్‌హాస్ వంటి దిగ్గజ క్రికెటర్లు కూడా ఈ లీగ్‌లో తమ ప్రతిభను కనబరుస్తున్నారు.

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025లో మొత్తం 6 జట్లు ఆడుతున్నాయి. వీటిలో ఇండియా మాస్టర్స్ జట్టు ప్రస్తుతం ముందంజలో ఉంది. ఇండియా మాస్టర్స్ ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. ఆస్ట్రేలియా మాస్టర్స్ విజయాల ఖాతా ఇంకా తెరవలేదు. అది ఆడిన రెండు తొలి మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలయ్యింది. వీటితో పాటు శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ కూడా ఈ లీగ్‌లో భాగంగా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories