IND V AUS 3rd ODI : ఆసీస్ పై టీమిండియా ఘన విజయం.. 2-1తో సిరీస్ కైవసం

IND V AUS 3rd ODI : ఆసీస్ పై టీమిండియా ఘన విజయం.. 2-1తో సిరీస్ కైవసం
x
India vs Australia 3rd odi
Highlights

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించి సిరీస్ 2-1తో కైవసం చేసుకుంది

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేలో టీమిండియా ఘనవిజయం సాధించి సిరీస్ 2-1తో కైవసం చేసుకుంది. బెంగళూరు చిన్నస్వామి వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా నిర్ధేశించిన 287పరుగుల లక్ష్యాన్ని 15 మరో బంతులు మిగిలి ఉండగానే 289 పరుగులు చేసి అలవోకగా ఛేదించింది. టీమిండియా ఓపెనర్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (119పరుగులు, 128 బంతుల్లో, 8ఫోర్లు 6 సిక్సులతో) శతకం సాధించి ఆస్ట్రేలియా బౌలర్లపై చెలరేగిపోయాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (89 పరుగులు, 91 బంతుల్లో 8 ఫోర్లు )తో రాణించాడు. ఈ మ్యాచ్‌లో ధావన్ గాయం కారణంతో బ్యాటింగ్ రాలేదు. ఓపెనర్లుగా రోహిత్ జోడీగా కేఎల్ రాహుల్ వచ్చాడు. ఇద్దరు కలిసి తొలి వికెట్ 69 పరుగల భాగస్వామన్యం నెలకొల్పారు. రాహుల్ (19) పరుగులు చేసి ఆగర్ బౌలింగ్ వికెట్ల ముందు దొరికిపోయాడు.

మూడో బ్యాట్స్ మెన్ గా వచ్చిన కోహ్లీ రోహిత్ అండగా నిలవడంతో ఇద్దరు కలిసి ఆసీస్ బౌలర్లను ఉతికారేశారు. రెండో వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సమయంలో హేజిల్‌వుడ్ వేసిన 30వ ఓవర్ రెండో బంతికి రోహిత్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై రోహిత్ ఎనిమిదో వన్డే సెంచరీ నమోదు చేయడం విశేషం. సచిన్ తొమ్మిది సెంచరీలతో ముందున్నాడు. వన్డేల్లో 9వేల పరుగుల సాధించిన క్రికెటర్ల లీస్టులో రోహిత్ చేరాడు. సెంచరీ అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నంలో రోహిత్ ఔటైయ్యాడు. దీంతో ఇద్దరి భాగస్వామ్యానికి తెరపడింది. ఈ సిరీస్ లో టీమిండియా కెప్టెన్ మరో అరుదైన ఘనత సాధించాడు. కెప్టెన్ గా 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ధోని పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. 11208 కోహ్లీ 199 ఇన్నింగ్స్ లో సాధిస్తే.. ధోని (330 ) 11,207 ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించాడు.

అప్పటి వరకు నిలకడగా ఆడిన కోహ్లీ రోహిత్ అవుటైన తర్వాత చెలరేగిపోయాడు. విజయానికి 13పరుగుల దూరంలో కోహ్లీ అవుటైయ్యాడు. విజయానికి దగ్గరలో ఇద్దరు అవుట్ కావడంతో శ్రేయస్స్ అయ్యార్ (44), పాండే ( 8)లాంఛనాన్ని పూర్తి చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్ వుడ్ , ఆగర్, జాంపా తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్దు రోహిత్ శర్మ దక్కింది. ఇక ఈ నెల 24న న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ జరగనుంది.

అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఫించ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 286 పరుగులు సాధించింది. బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ కొద్ది సేపటికే ఓపెనర్ డేవిడ్ వార్నర్ వికెట్ ను కోల్పోయింది. వెంటనే జట్టు 46 పరుగుల వద్ద మరో ఓపెనర్ కెప్టెన్ ఫించ్ రనౌటైయ్యాడు. దీంతో కష్టాల్లో పడిన జట్టును స్మిత్, లబుషేన్ ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 108 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఒక దశలో 350 పరుగులు సాదింస్తుందనుకున్న క్రమంలో జడేజా వేసిన మూడో బంతికి మార్నస్ లుబుషేన్ (54 పరుగులు, 64 బంతుల్లో, 5ఫోర్లు ) కెప్పెన్ కోహ్లీ చేతికి దొరికిపోయాడు. క్రీజులోకి వచ్చిన ఆలెక్స్ కారే (35, 36బంతుల్లో 6X4 ) పరుగులతో వేగంగా ఆడాడు. ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో శ్రేయస్స్ అయ్యారుకు క్యాచ్ ఔట్ రూపంలో వెనుదిరిగాడు.

ఇక అదే ఓవర్‌లో చివరి బంతికి విచెల్ స్టార్క్(0) గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. స్టార్క్ భారీ షాట్ కు యత్నించి చాహల్ చేతికి చిక్కాడు. దీంతో ఆసీస్ స్కోరు నెమ్మదించింది. టీమిండియా బౌలర్లపై దాటిగా ఆడిన ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్మిత్ (131 పరుగులు, 132బంతులు, 14 ఫోర్లు, 1 సిక్సు)లతో సెంచరీ చేశాడు. 44 ఓవర్లో సెంచరీ సాధించిన స్మిత్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 48 ఓవర్లో షమీ వేసిన తొలి బంతికి స్మిత్ భారీ షాట్ కు యత్నించి పెవిలియన్ బాట పట్టాడు.

మొదట్లో ధారళంగా పరుగులు సమర్పించిన టీమిండియా బౌలర్లు చివరల్లో ఆసీస్ ను కట్టడి చేశారు. అనంతరం వచ్చిన పాట్ కామిక్స్ కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా తొమ్మిది కోల్పోయింది. టీమిండియా బౌలర్లలో షమీ నాలుగు వికెట్లతో సత్తాచాటగా.. జడేజా రెండు వికెట్లు తీసుకున్నాడు. నవదీప్ షైనీ, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. బుమ్రా ఈ మ్యాచ్ లో నిరాశపరిచాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories