IND V AUS 3rd ODI : లబుషేన్ రికార్డు ఫిఫ్టీ అంతలోనే..

IND V AUS 3rd ODI :  లబుషేన్ రికార్డు ఫిఫ్టీ అంతలోనే..
x
Highlights

నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత బౌలర్లను ఆసీస్ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌లో లబుషేన్ తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. మూడు వన్డే అంతర్జాతీయ...

నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత బౌలర్లను ఆసీస్ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌లో లబుషేన్ తన తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. మూడు వన్డే అంతర్జాతీయ మ్యాచులు ఆడిన లబుషేన్ భారత్ పై తన తొలి అర్ధ శతకాన్ని చేశాడు. 64బంతులుఎదుర్కొన్న లుషేన్ 54 పరుగులు చేసి ఔటయ్యాడు. షమీ వేసిన 31వ ఓవర్లో ఐదో బంతిని మిడ్ ఆన్ మీద బౌండరీ తరలించి తన తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. అదే ఓవర్లో సింగిల్ తీశాడు. అనంతరం జాడేజా బౌలింగ్ లో భారీ షాట్ యత్నించి కోహ్లీకి క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. దీంతో 108 పరుగుల వీరి భాగస్వామ్యానికి జడేజా తెర దించాడు. 33 ఓవర్లు ముగిసే సమయానికి ఆసీస్ నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. స్టార్క్‌ కూడా జాడేజా బౌలింగ్ లో ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. స్మిత్ 78 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories