India vs Australia: చేతులెత్తేసిన ఆసీస్ టాపార్డర్.. విజయం ముంగిట భారత్

India vs Australia:  చేతులెత్తేసిన ఆసీస్ టాపార్డర్.. విజయం ముంగిట భారత్
x
Highlights

బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న2వ టెస్టులో టీమిండియా పట్టు బిగించింది.

బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న2వ టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. భారత జట్టు సమష్టిగా చెలరేగి విజయానికి చేరువైంది. మరోసారి టీమిండియా బౌలర్లు కలిసి కట్టుగా చెలరేగడంతో ఆసీస్ టాపార్డర్ చెతులెత్తేసింది. ఇక మూడో రోజు ఆట ముగిసరికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 66 ఓవర్లలో 6 వికెట్ల కోల్పోయి 133 పరుగులు చేసింది. ఆసీస్ లోఆర్డర్ ప్యాట్ కమిన్స్(15 ), కామెరూన్ గ్రీన్(17) పోరాడుతున్నారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో మాథ్యూ వేడ్(40), లుబషేన్(28) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

మూడో రోజు ముగిసేసరికి ఆసీస్ 2 పరుగుల ఆధిక్యంలో ఉంది. మిగిలిన నాలుగు వికెట్లను నాలుగో రోజు ఆటలో ఎంత త్వరగా తీస్తే టీమిండియా విజయం అంత సులువు అవుతోంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోర్‌ 277/5తో మూడో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా17 పరుగుల వ్యవధిలోనే రహానే వికెట్ కోల్పోయింది. లయన్ వేసిన 100వ ఓవర్ చివరి బంతిని జడేజా సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. లబుషేన్ వేగంగా బంతి అందుకుని కీపర్‌కు పైన్ అందజేయడంతో కీపర్ కు ఇవ్వడంతో రహానే నిరాశగా వెనుదిరిగాడు. జడేజా హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లు చెలరేగడంతో దాంతో భారత్ ఇన్నింగ్స్ పేకమేడల్లా కుప్పకూలింది. 32 పరుగుల వ్యవధిలోనే చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. భారత్‌కు 131 పరుగుల ఆధిక్యంతో 326 వద్ద ఫస్ట్ ఇన్నింగ్స్ పరుగులకు ముగించింది.

రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ ఆస్ట్రేలియా ఓపెనర్ జోబర్న్స్(4)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి భారత్‌కు శుభారంభాన్ని అందించాడు. లబుషేన్‌తో జతకలిసిన ఓపెనర్ మాథ్యూవేడ్ పోరాడే ప్రయత్నం చేశాడు. కానీ అశ్విన్ అద్భుత బంతితో లబుషేన్‌‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత స్మిత్ (8)బుమ్రా అద్భుత బాల్‌కు పెవిలియన్ చేరాడు. దాంతో ఆసీస్ 1 పరుగు వ్యవధిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు, సిరాజ్, బుమ్రా, అశ్విన్ ఉమేశ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories