పతంగి చూసి కంగారు పడ్డా : వార్నర్

పతంగి చూసి కంగారు పడ్డా : వార్నర్
x
వార్నర్
Highlights

టీమిండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నీవేశం చోటుచేసుకుంది.

టీమిండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నీవేశం చోటుచేసుకుంది. ఓ గాలిపటం కారణంగా మ్యాచ్ కొద్ది క్షణాలు నిలిచిపోయింది. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 50 ఓవర్ ముందు ఓ గాలిపటం గ్రౌండ్ లో పడింది. స్పైడర్ కెమెరాకు చిక్కుకుంది. మైదానంలో ఫిల్డింగ్ చేస్తున్న డేవిడ్ వార్నర్ దానిని చూసి కంగారు పడ్డాడు. గాలి పటాన్ని అక్కడ నుంచి తొలించడానికి కాస్త సంశయించాడు. దీంతో టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా పతంగి ధారాన్ని తెంచి కెమెరా నుంచి అడ్డుగా ఉన్నదాన్ని తొలిగించాడు. దాన్ని చించే ప్రయత్నం చేయబోయాడు. డేవిడ్ వార్నర్ వద్దని అది ఏ చిన్నారి గాలిపటంమో చించోద్దని చెప్పడు. ఈ విషయాన్ని వార్నర్ మీడియా సమావేశంలో తెలిపాడు.

ఇండియాలో కైట్ ఫెస్ట్ వెల్ జరుగుతోందని తాను విన్నానని. అందుకే చిన్నారి గాలిపటం అయి ఉంటుందని దానిని చించోద్దని బుమ్రాకు చెప్పినట్లు వెల్లడించారు. మ్యాచ్ మధ్యలోకి గాలిపటం రావడం ఇది చాలా వింతగా అనిపించిందని కెమెరాకు చిక్కుకున్న గాలిపటం చూసి కంగారు పడ్డానని చెప్పాడు. అది ప్రమాదకరమైదేమోనని అనుకన్నా, తర్వాత కొంచెం తెరుకున్నాక కైట్ ఫెస్ట్ వెల్ సంబంధించిన గాలి పటం అని అర్ధమైంది అని వార్నర్ తెలిపారు. గాలిపటం కారణంగా మ్యాచ్ ఆగిపోవడం ఆశ్చర్యమేసింది.

ఈ మ్యాచ్ లో టీమిండియాపై ఆసీస్ సునాయస విజయం నమోదు చేసుకుంది. వరస సీరిస్ ల్లో విజయాలు సాధిస్తున్న టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గట్టి ప్రత్యర్థి ఎదురైతే ఆ మ్యాచ్ ఎలా ఉంటుందో తెలిసోచ్చింది. 256 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ సునాయసంగా ఛేదించింది. వికెట్‌ కూడా నష్టపోకుండానే భారత్‌ను చిత్తు చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌- కెప్టెన్ అరోన్‌ ఫించ్‌లు సెంచరీలతో కదం తొక్కారు. టీమిండియా నిర్దేశించిన 256 పరుగుల టార్గెట్‌ను 37. 4 ఓవర్లలోనే ఉదేసింది. వార్నర్(128 పరుగులు, 112 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సు)లతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ ఫించ్‌ (110 పరుగులు114 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సు)లతో నాటౌట్‌గా నిలిచాడు. మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు డేవిడ్ వార్నర్ అందుకున్నాడు. మూడు వన్డేల సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0తో ముందంజలో ఉంది. ఈ సిరీస్ లో జరగబోయే రెండో వన్డే ఈ నెల 17న రాజ్‌కోట్‌లో జరగనుంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories