IND v AUS 1st ODI : టీమిండియాపై 10 వికెట్లతో ఆసీస్ విజయం..


సెంచరీలతో కదం తొక్కిన ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నార్ , ఫించ్
ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా వాఖండే వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ పై ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియాపై ఆసీస్ సునాయస విజయం నమోదు చేసుకుంది. వరస సీరిస్ ల్లో విజయాలు సాధిస్తున్న టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గట్టి ప్రత్యర్థి ఎదురైతే ఆ మ్యాచ్ ఎలా ఉంటుందో తెలిసోచ్చింది. 256 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ సునాయసంగా ఛేదించింది. వికెట్ కూడా నష్టపోకుండానే భారత్‌ను చిత్తు చేసింది. ఆస్ట్రేలియా ఓపెనర్లు డేవిడ్ వార్నర్- కెప్టెన్ అరోన్ ఫించ్‌లు సెంచరీలతో కదం తొక్కారు. టీమిండియా నిర్దేశించిన 256 పరుగుల టార్గెట్‌ను 37. 4 ఓవర్లలోనే ఉదేసింది. వార్నర్(128 పరుగులు, 112 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్సు)లతో అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్ ఫించ్ (110 పరుగులు114 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సు)లతో నాటౌట్‌గా నిలిచాడు. మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు డేవిడ్ వార్నర్ అందుకున్నాడు. మూడు వన్డేల సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0తో ముందంజలో ఉంది. ఈ సిరీస్ లో జరగబోయే రెండో వన్డే ఈ నెల 17న రాజ్‌కోట్‌లో జరగనుంది.
అందుకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 49.1 ఓవర్లో 255 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ జట్టు ఓపెనర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇన్నింగ్స ఆరంభించారు. రోహిత్ శర్మ (10) జట్టు స్కోరు 13 పరుగుల వద్ద ఔటైయ్యాడు. 4.3 ఓవర్ల వద్ద స్టార్క్ 5 ఓవర్ మూడో బంతిని మిడాఫ్ మీదుగా రోహిత్ ఆడటానికి యత్నించాడు. డేవిడ్ వార్నర్ క్యాచ్ అందుకోవడంతో రోహిత్ పెవిలియన్ ధారి పట్టాడు. మొదట రెండు ఫోర్లు కొట్టి రోహిత్ ఊపు మీదున్నట్లు కనిపించినా స్టార్క్ వేసిన బంతిని అంచనా వేయడంతో విఫలమైయ్యాడు. రెండో వికెట్ కు ఓపెనర్ ఖర్ ధావన్ (74 పరుగులు, 91 బంతుల్లో 9ఫోర్లు ఒక సిక్స్) , రాహుల్(47 పరుగులు, 61 బంతుల్లో 4 ఫోర్లు) ఇద్దరూ కలిసి 121 పరుగుల భాగస్వామన్యం నెలకొల్పారు. ధావన్ 66 బంతులు ఎదుర్కొన్న ధావన్ 8 ఫోర్లుతో ఆర్ధసెంచరీ సాధించాడు. వన్డే కెరీర్ లో ధావన్ కు 28వ హాఫ్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ధావన్ ఆర్థ సెచంరీతో తర్వాత ఆసీస్ బౌలర్లపై చెలరేగిపోయాడు. కేఎల్ రాహుల్ 47 పరుగులు చేసిన ఆర్థసెంచరీకి చేరువలో ఆగర్ బౌలింగ్ లో సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుటైయ్యాడు. ఆరు పరుగల వ్యవధిలో ధావన్ కూడా కామిక్స్ బౌలింగ్ లో ఆవుటైయ్యాడు. దీంతో కెప్టెన్ కోహ్లీ, శ్రేయస్స్ అయ్యార్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి సిక్స్ కొట్టిన ఊపుమీద ఉన్నాడు. జంపా వేసిన స్టయిట్ డ్రైవ్ బంతిని షాట్ కొట్టబోయి రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. అనంతరం శ్రేయస్స అయ్యార్(4) స్టార్క్ బౌలింగ్ లో కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటైయ్యడు. 164 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.
అనంతంర బరిలోకి వచ్చిన జాడేజా(25), రిషబ్ పంత్(28) తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేశారు. పంత్(28), జాడేజా(25) ఇద్దరు కలిసి ఆరో వికెట్ కు 49 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయకలిగింది. 41 ఓవర్లు ముగిసేసరిగి ఆరు వికెట్ల నష్టానకి భారత్ 213 పరుగలు చేసింది. దీంతో భారత్ రెండు వందల మార్క్ దాటింది. అయితే రిచర్డ్‌సన్ విసిరిన గుగుల్లీ డెలివరిని అడ్డుకోవడంతో జాడేజా వికెట్ కీపర్ అలెక్స్ కేరీ క్యాచ్ ఇచ్చి అవుటైయ్యాడు. రిషబ్ పంత్ కామిక్స్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. మహ్మాద్ షమీ(10), శార్థుల్ ఠాకుర్ (13) , కూల్దీప్ యాదరవ్ (17) తక్కువ స్కోరుకే పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో భారత్ 255పరుగలకు పరిమితమైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. కామిక్స్ , రిచర్డ్ సన్ చెరో రెండు వికెట్లు తీశారు. జంపా, ఆగర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
That's it! Australia have recorded their biggest win over India EVER! Incredible performance
— cricket.com.au (@cricketcomau) January 14, 2020
SCORES: https://t.co/J8WD0geFkm #INDvAUS pic.twitter.com/Poqrimp4DW

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



