IND v AUS 1st ODI : డేవిడ్‌ వార్నర్‌ రికార్డ్

IND v AUS 1st ODI : డేవిడ్‌ వార్నర్‌ రికార్డ్
x
Warner And Finch
Highlights

వాంఖేడే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా నిర్దేశించిన 256పరుగుల లక్ష‌్యంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. ఆ జట్టు ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌...

వాంఖేడే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా నిర్దేశించిన 256పరుగుల లక్ష‌్యంతో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. ఆ జట్టు ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (60 పరుగులు, 49బంతుల్లో, ఆరు ఫోర్లు, 2 సిక్సులు), ఆరోన్‌ ఫించ్‌(60, 62బంతుల్లో 9ఫోర్లు, 1 సిక్స్) రాణిస్తున్నారు. 20 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా ఆస్ట్రేలియా 140 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు అర్థ సెంచరీలతో చెలరేగారు. వార్నర్ తన కెరీర్ లో 21వ హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఫించ్ కూడా తన కెరీర్ 25వ అర్థశతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఆస్ట్రేలియా ఓపెనర్లు 140 భాగస్వామ్యం నమోదు చేయడం విశేషం. మరోవైపు భారత బౌలర్లు తేలిపోయరు. ఒక కుల్దీప్ యాదవ్ కట్టదిట్టమైన బౌలింగ్ చేస్తున్నాడు.

డేవిడ్‌ వార్నర్‌ తన 115వ వన్డే ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో వేగవంతంగా 5వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వార్నర్‌ ఐదు వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories