IND v AUS 1st ODI : టీమిండియా 255 ఆలౌట్

IND v AUS 1st ODI :  టీమిండియా 255 ఆలౌట్
x
India vs australia
Highlights

వాంఖేడే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో 49.1 ఓవర్లలో 255 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా ముందు 256 విజయ లక్ష్యం ఉంచింది. ధావన్ 74 పరుగుతో...

వాంఖేడే వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో 49.1 ఓవర్లలో 255 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా ముందు 256 విజయ లక్ష్యం ఉంచింది. ధావన్ 74 పరుగుతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అందుకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ రోహిత్ శర్మ (10) జట్టు స్కోరు 13 పరుగుల వద్ద ఔటైయ్యాడు. 4.3 ఓవర్ల వద్ద స్టార్క్ 5 ఓవర్‌ మూడో బంతిని మిడాఫ్‌ మీదుగా రోహిత్‌ ఆడటానికి యత్నించాడు. డేవిడ్‌ వార్నర్‌ క్యాచ్‌ అందుకోవడంతో రోహిత్ పెవిలియన్ ధారి పట్టాడు. మొదట రెండు ఫోర్లు కొట్టి రోహిత్ ఊపు మీదున్నట్లు కనిపించినా స్టార్క్ వేసిన బంతిని అంచనా వేయడంతో విఫలమైయ్యాడు.

రెండో వికెట్ కు ఓపెనర్ ఖర్ ధావన్ (74 పరుగులు, 91 బంతుల్లో 9ఫోర్లు ఒక సిక్స్) , రాహుల్(47) ఇద్దరూ కలిసి 121 పరుగుల భాగస్వామన్యం నెలకొల్పారు. ధావన్ 66 బంతులు ఎదుర్కొన్న ధావన్ 8 ఫోర్లుతో ఆర్ధసెంచరీ సాధించాడు. వన్డే కెరీర్ లో ధావన్ కు 28వ హాఫ్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ధావన్ ఆర్థ సెచంరీతో తర్వాత ఆసీస్ బౌలర్లపై చెలరేగిపోయాడు. కేఎల్ రాహుల్ 47 పరుగులు చేసిన ఆర్థసెంచరీకి చేరువలో ఆగర్ బౌలింగ్ లో సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి అవుటైయ్యాడు. ఆరు పరుగల వ్యవధిలో ధావన్ కూడా కామిక్స్ బౌలింగ్ లో ఆవుటైయ్యాడు. దీంతో కెప్టెన్ కోహ్లీ, శ్రేయస్స్ అయ్యార్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లి సిక్స్‌ కొట్టిన ఊపుమీద ఉన్నాడు. జంపా వేసిన స్టయిట్‌ డ్రైవ్‌ బంతిని షాట్ కొట్టబోయి రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. అనంతరం శ్రేయస్స అయ్యార్(4) స్టార్క్ బౌలింగ్ లో కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటైయ్యడు. 164 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.30 పరుగలు వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. రాహుల్, ధావన్, కోహ్లీ, శ్రేయస్స్ అయ్యార్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

అనంతంర బరిలోకి వచ్చిన జాడేజా, పంత్ తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేశారు. 41 ఓవర్లు ముగిసేసరిగి ఆరు వికెట్ల నష్టానకి భారత్ 213 పరుగలు చేసింది. పంత్(28), జాడేజా(25) ఇద్దరు కలిసి ఆరో వికెట్ కు 49 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో భారత్ రెండు వందల మార్క్ దాటింది. అయితే రిచర్డ్‌సన్‌ విసిరిన గుగుల్లీ డెలివరిని అడ్డుకోవడంతో జాడేజా వికెట్ కీపర్ అలెక్స్‌ కేరీ క్యాచ్ ఇచ్చి అవుటైయ్యాడు. రిషబ్ పంత్(28) కామిక్స్ బౌలింగ్ లో అవుటైయ్యాడు. మహ్మాద్ షమీ(10), శార్థుల్ ఠాకుర్ (13) , కూల్దీప్ యాదరవ్ (17) ఔటైయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. కామిక్స్ , రిచర్డ్ సన్ చెరో రెండు వికెట్లు తీశారు. జంపా, ఆగర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories