NZ XI Vs IND : ప్రాక్టిస్‌లో ఆడుకున్నారు.. తుది పోరులో ఏం చేస్తారో !

NZ XI Vs IND : ప్రాక్టిస్‌లో ఆడుకున్నారు.. తుది పోరులో ఏం చేస్తారో !
x
NZ XI Vs IND 3-day Practice Match
Highlights

టీమిండియా కివీస్ ఎలెవన్ మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్లు పృథ్వీ షా(39పరుగులు,31...

టీమిండియా కివీస్ ఎలెవన్ మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్లు పృథ్వీ షా(39పరుగులు,31 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌), మయాంక్‌ అగర్వాల్‌(81 పరుగులు, 99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) రిటైర్డ్‌ హర్ట్, మంచి ఆరంభాన్ని అందించారు. ఇద్దరు కలిసి కలిసి 72 పరుగులు శుభారంభాన్ని ఇచ్చారు. అంతకుమందు ఓవర్ నైట్ స్కోరు 59 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో మూడు స్థానంలో వచ్చిన శుబ్‌మన్‌ గిల్‌(8) నిరాశపరిచాడు. మయాంక్‌కు జత కలిసిన రిషభ్‌ పంత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అర్థ శతకం నమోదు చేశాడు. దీంతో ఇద్దరు కలిసి మూడో వికెట్ కు 34 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తర్వాత పంత్ ఔటయ్యాడు. టీమిండియా ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 252 పరుగులు చేయడంతో మ్యాచ్‌ డ్రా అయ్యింది. వృద్ధిమాన్‌ సాహా(30 నాటౌట్‌), అశ్విన్‌(16 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు.

టీమిండియాలో చోటు దక్కించుకోవడానికే తంటాలుపడుతున్న యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ తర్వాత రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమైన రిషభ్‌ పంత్ .. కివీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు బ్యాట్‌ ఝుళిపించడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం. మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ న్యూజిలాండ్‌ ఎలెవన్‌పై రెండో ఇన్నింగ్స్‌లో అర్థ శతకం సాధించాడు. 65 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70 పరుగులు సాధించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రిషభ్‌ తొలుత నెమ్మదిగా ఆడాడు.. ఆతర్వాత దూకుడు ప్రదర్శించాడు. ఫలితంగా హాఫ్‌ సెంచరీతో మెరిశాడు.

అంతకుముందు రెండో రోజు టీమిండియా పైచేయి సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా పేస్ దళం అదరగొట్టింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ ఎలెవన్‌ టీమిండియా బౌలర్ల దాటికి 235పరుగులకే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి ఏడు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ ఎలెవన్‌ ఏ దశలోనూ ప్రభావం చూపలేకపోయింది. ఓపెనర్లలో విల్‌ యంగ్‌(2)ను బుమ్రా ఔట్‌ చేయగా.. టిమ్‌ సీఫెర్టీ(9)ని షమీ పెలివియన్ చేర్చాడు.

దీంతో న్యూజిలాండ్‌ ఎలెవన్‌ 36 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రచిన్‌ రవీంద్ర(34), ఫిన్‌ అలెన్‌(20), హెన్రీ కూపర్‌(40), టామ్‌ బ్రూస్‌(31), మిచెల్‌(32)లు రాణించడంతో కివీస్ ఎలెవన్ 235 పరుగులు చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్‌ షమీ మూడు వికెట్ల సత్తాచాటాడు.‎ జస్‌ప్రీత్‌ బుమ్రా, సైనీ, ఉమేశ్‌ యాదవ్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. కివీస్ ఎలెవన్ బ్యాట్స్ మెన్ 10 వికెట్లలో 9 వికెట్లు పేస్‌ బౌలర్లు సాధిస్తే, స్పిన్నర్‌ అశ్విన్‌కు వికెట్‌ దక్కించున్నాడు. భారత్ 263 పరుగులకు మొదటి ఇన్నింగ్ ఆలౌటైంది. భారత్‌ 38 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో టీమిండియాను హనుమ విహారి(101, 182బంతుల్లో, 10 ఫోర్లు, 3 సిక్సు)లతో అజేయ సెంచరీ సాధించాడు. పుజారా (93, 211బంతుల్లో,11 పోర్లు, 1 సిక్సు) రాణించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories