India Vs Australia: వర్షం కారణంగా నిలిచిన మ్యాచ్

India Vs Australia: వర్షం కారణంగా నిలిచిన మ్యాచ్
x
ఆస్ట్రేలియా , ఇండియా 
Highlights

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్నఆఖరి టెస్టు రెండో రోజు ఆటలో మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో టీమిండియా...

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్నఆఖరి టెస్టు రెండో రోజు ఆటలో మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ నిలిచిపోయింది. రెండో సెషన్‌ పూర్తయ్యేసరికి భారత్‌ 26ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. పుజారా (8), కెప్టన్ అజింక్య రహానే (2) క్రీజులో ఉన్నారు. టీ బ్రేక్ అనంతరం భారీ వర్షం కురవడంతో మ్యాచ్ ఆగిపోయింది.

అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. 274/5 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ఆసీస్ కొనసాగించింది. టిమ్‌ పైన్ పైన్ ‌(50; 104 బంతుల్లో 6x4) అర్థ శతకం చేశాడు. టెస్టుల్లో అతనికిది 9వ అర్ధ శతకం. అయితే శార్దుల్‌ ఠాకుర్‌ వేసిన 100వ ఓవర్‌లో స్లిప్‌లో రోహిత్ శర్మ చేతికి చిక్కి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్‌లో కామెరూన్‌ గ్రీన్ కూడా ‌(47; 107 బంతుల్లో 6x4) ఔటయ్యాడు. వీరిద్దరూ‌ ఆరో వికెట్‌కు 111 పరుగులు జోడించారు. స్టార్క్ , లైయన్ బౌండరీలతో విరుచుపడ్డారు.

ఈ నేపథ్యంలోనే బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌ ఆదిలోనే ఓపెనర్ శుభ్‌మన్ ‌ గిల్ ‌(7) వికెట్‌ కోల్పోయింది. పాట్ కమిన్స్‌ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌ చేతికి చిక్కాడు. ఆపై రోహిత్ శర్మ ‌(44; 74 బంతుల్లో 6x4), ఛెతేశ్వర్‌ పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో అర్ధ శతకానికి చేరువైన హిట్‌మ్యాన్‌ను స్పిన్నర్ నాథన్ లైయన్‌ బోల్తా కొట్టించాడు. దీంతో 60 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. వీరద్దరు జోడి 37 బంతుల్లో 2 పరుగులు నమోదైంది. ఈ నేపథ్యంలో వర్షం కురవడంతో మ్యాచ్ రెండో రోజు నిలిపివేస్తు అంపైర్లు ప్రకటించారు. మరో మూడు రోజుల మ్యాచ్ మిగిలివుంది. తొలి ఇన్నింగ్స్ భారత్ 307 పరుగుల వెనుకంజలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories