కోహ్లీ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు.. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే

కోహ్లీ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు.. 30 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే
x
విరాట్ కోహ్లీ
Highlights

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు చేరింది.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు చేరింది. కివీస్‌పై జరిగిన మూడు వన్డేల సిరీస్ వైట్‌వాష్ చేయించుకున్న సంగతి తెలిసిందే. 1989లో ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్ విండీస్ చేతిలో 5-0తో ఓడిపోయింది. ఆ త్వర్వాత ఇప్పటి వరకు ద్వైపాక్షిక సిరీస్‌లలో క్లీన్‌స్వీప్ రూపంలో దారుణ పరాభవం ఎదురుకాలేదు. తాజాగా కివీస్ చేతిలో టీమిండియా మూడు వన్డేలు సిరీస్‌లలో క్లీన్‌స్వీప్‌కు గురైంది. దీంతో కోహ్లీ కెప్టెన్సీలో మూడు వన్డేల్లో ఓటమి చెంది, కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో అత్యంత చెత్త రికార్డు చేర్చింది. 30 సంవత్సరాల తరువాత వన్డేల్లో భారత్ తొలి వైట్‌వాష్‌తో ఖాతాలో వేసుకుంది.

1989లో ద్వైపాక్షిక సిరీస్‌లలో దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ నేతృత్వంలోని భారత్ బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌ను 50 పరుగుల తేడాతో వెస్టిండీస్ పై 5-0తో కోల్పోయింది. రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో కూడా ఐదు వన్డే సిరీస్ సౌతాఫ్రికా 4-0తో క్లీన్‌స్వీప్ చేసింది. తొలి వన్డే రద్దు అయింది.స్మిత్ నేతృత్వంలోని సౌతాఫ్రికా భారత్ ను మట్టికరిపించింది.అయితే దక్షిణాఫ్రికాపై జరిగింది ద్వైపాక్షిక సిరీస్ కాదు.

కాగా... ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా 297 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్‌ ఓపెనర్‌ పృథ్వీ షా (42 పరుగులు బంతుల్లో 40; ఫోర్లు 3, సిక్స్‌లు 2)రాణించారు. శ్రేయాస్‌ అయ్యర్‌ (63 పరుగులు బంతుల్లో 62; ఫోర్లు 4), మనీష్‌ పాండే (48 బంతుల్లో 42; ఫోర్లు 2)తో మరోసారి సత్తాచాటాడు. రాహుల్‌ (112 పరుగులు, 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌)ల సెంచరీతో కదం తొక్కాడు.

అయితే భారత్‌ నిర్ధేశించిన 297 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ సునాయాసంగా ఛేదించింది. ఆ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. కివీస్ ఓపెనర్లు హెన్రీ నికోల్స్‌(80 పరుగులు,103 బంతుల్లో,9ఫోర్లు) టాప్ స్కోరర్‌కాగా మార్టిన్‌ గప్టిల్‌(46 బంతుల్లో 66: 6 ఫోర్లు, 4 సిక్సర్లు)తో రాణించాడు. గ్రాండ్ హోమ్(58,28 బంతుల్లో, 6 ఫోర్లు, 3 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ తోడవ్వడంతో కివీస్ అలవోకగా విజయం సాధించిన సంగతి తెలసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories