Team India: గిల్ సెంచరీ, సిరాజ్-ఆకాష్ దీప్ మాయాజాలం.. చివరి రోజు భారత్ కు కావాల్సింది ఇదే

Team India: గిల్ సెంచరీ, సిరాజ్-ఆకాష్ దీప్ మాయాజాలం.. చివరి రోజు భారత్ కు కావాల్సింది ఇదే
x
Highlights

Team India: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్ నాలుగో రోజున కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టగా, బౌలర్లు మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ తమ మెరుపు బౌలింగ్ తో ఇంగ్లాండ్‌ను దెబ్బతీశారు.

Team India: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్ నాలుగో రోజున కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టగా, బౌలర్లు మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ తమ మెరుపు బౌలింగ్ తో ఇంగ్లాండ్‌ను దెబ్బతీశారు. ఆతిథ్య ఇంగ్లాండ్‌కు 608 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి కేవలం 72 పరుగులకే 3 కీలక వికెట్లు పడగొట్టింది. దీంతో ఐదో రోజు, అంటే చివరి రోజు.. ఇంగ్లాండ్‌కు గెలవాలంటే ఇంకా 536 పరుగులు అవసరం కాగా, టీమిండియాకు కేవలం 7 వికెట్లే కావాలి. ఇది ఎడ్జ్‌బాస్టన్‌లో 58 ఏళ్లుగా టీమిండియాకు అందని ద్రాక్షగా ఉన్న విజయాన్ని సొంతం చేసుకునే అద్భుత అవకాశం.

అంతకుముందు టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌ను 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మళ్ళీ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. అతను 161 పరుగులతో భారీ సెంచరీని నమోదు చేశాడు. గిల్‌కు మంచి మద్దతునిచ్చిన రిషభ్ పంత్ 65 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా కూడా 69 పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్ కూడా 55 పరుగులతో రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో టాంగ్, స్పిన్నర్ షోయెబ్ బషీర్ చెరో 2 వికెట్లు తీయగా, బ్రైడన్ కార్సే, జో రూట్ చెరో ఒక వికెట్ పడగొట్టారు.

భారత్ నిర్దేశించిన 608 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఆరంభం ఏమాత్రం బాగా లేదు. వారి ఓపెనర్ జాక్ క్రాలీ సున్నా పరుగులకే మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడే బెన్ డకెట్‌ను ఆకాష్ దీప్ పెవిలియన్ దారి పట్టించాడు. దీంతో రెండు వికెట్లు త్వరగా కోల్పోయిన ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో జో రూట్‌పై చాలా బాధ్యత పడింది. కానీ, ఆకాష్ దీప్ వేసిన అద్భుతమైన బంతికి కేవలం 6 పరుగులకే జో రూట్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

భారత్ బౌలర్లలో ఆకాష్ దీప్ మరోసారి తన సత్తా చాటాడు. అతను కీలకమైన 2 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. వీరిద్దరి నిప్పులు చెరిగే బౌలింగ్‌తో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి హ్యారీ బ్రూక్ 15 పరుగులతో, ఓలి పోప్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఐదవ చివరి రోజు ఆటలో టీమిండియాకు కేవలం 7 వికెట్లు పడగొట్టాల్సి ఉంది. ఇంగ్లాండ్‌కు గెలవాలంటే ఇంకా 536 పరుగులు చేయాలి. ఎడ్జ్‌బాస్టన్‌లో 58 ఏళ్లుగా టీమిండియాకు టెస్ట్ విజయం దక్కలేదు. గత 8 టెస్టుల్లో భారత్ 7 సార్లు ఓటమి పాలైంది. ఈసారి, శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టు ఈ రికార్డును బద్దలు కొట్టి, చారిత్రాత్మక విజయాన్ని సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories