India Semi Final Scenario: విండీస్ గెలిచినా సెమీస్ ఆశలు ఇంకా సజీవమే.. భారీ విజయాలే భారత్‌కు మార్గం!

India Semi Final Scenario
x

India Semi Final Scenario: విండీస్ గెలిచినా సెమీస్ ఆశలు ఇంకా సజీవమే.. భారీ విజయాలే భారత్‌కు మార్గం!

Highlights

India Semi Final Scenario: టీ20 ప్రపంచకప్‌ 2026లో సెమీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. భారత జట్టుకు ఇంకా అవకాశాలు పూర్తిగా ముగియలేదు.

India Semi Final Scenario: టీ20 ప్రపంచకప్‌ 2026లో సెమీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. భారత జట్టుకు ఇంకా అవకాశాలు పూర్తిగా ముగియలేదు. అయితే ఇకపై ప్రతి మ్యాచ్ ‘డూ ఆర్ డై’గా మారింది. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌ సూపర్-8 దశలో భారత్ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిందే. ఫిబ్రవరి 26న జింబాబ్వేతో చెన్నైలో, మార్చి 1న వెస్టిండీస్‌తో కోల్‌కతాలో భారత్ తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే భారత్ ఖాతాలో నాలుగు పాయింట్లు చేరతాయి.

మొదటి సినారియో:

సెమీస్ చేరడానికి భారత్‌కు అనుకూలంగా మూడు సినారియోలు ఉన్నాయి. మొదటిది ఏమిటంటే.. దక్షిణాఫ్రికా తమ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే, ఆ జట్టు ఆరు పాయింట్లతో టాప్‌లో నిలుస్తుంది. అప్పుడు భారత్ నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.

రెండో సినారియో:

రెండో సినారియోలో దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే.. భారత్, వెస్టిండీస్ రెండూ నాలుగు పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. ఆ సందర్భంలో ఈ రెండు జట్లు నేరుగా సెమీస్ చేరే అవకాశం ఉంటుంది.

మూడో సినారియో:

మూడో సినారియో మాత్రం అత్యంత క్లిష్టమైనది. దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్ గెలిచి, ఒకటి ఓడితే మూడు జట్లు నాలుగు పాయింట్లతో టై అవుతాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ ఆధారంగా సెమీస్ బెర్త్ ఖరారు అవుతుంది. ప్రస్తుతం భారత్ నెట్ రన్‌రేట్ –3.800గా ఉండటం పెద్ద సమస్య. అందుకే కేవలం గెలిస్తే సరిపోదు, భారీ తేడాతో విజయం సాధించాలి. ప్రత్యర్థులను పెద్ద మార్జిన్‌తో ఓడిస్తేనే భారత్ నెట్ రన్‌రేట్ మెరుగుపడుతుంది.

ఒక మ్యాచ్‌లో ఓడినా:

పై సినారియోలు కాకుండా.. భారత్ మిగిలిన రెండు మ్యాచులలో ఒక మ్యాచ్‌లో ఓడినా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, మంచి మార్జిన్ సాధిస్తే మాత్రం సెమీస్ అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి ఓవర్, ప్రతి రన్ టీ20 ప్రపంచకప్‌ 2026లో టీమిండియా భవిష్యత్తును నిర్ణయించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories