Rohit Sharma Record: ఎన్ని అవమానాలు ఎదురైనా అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రోహిత్ శర్మ..!

India Secures 3-0 Clean Sweep over England in Ahmedabad ODI Several Records Broken
x

Rohit Sharma Record: ఎన్ని అవమానాలు ఎదురైనా అరుదైన రికార్డు సొంతం చేసుకున్న రోహిత్ శర్మ..!

Highlights

Rohit Sharma Record: అహ్మదాబాద్ వన్డేలో ఇంగ్లాండ్‌ను 142 పరుగుల తేడాతో ఓడించి భారత్ వన్డే సిరీస్‌ను 3-0తో గెలుచుకుంది.

Rohit Sharma Record: అహ్మదాబాద్ వన్డేలో ఇంగ్లాండ్‌ను 142 పరుగుల తేడాతో ఓడించి భారత్ వన్డే సిరీస్‌ను 3-0తో గెలుచుకుంది. నాగ్‌పూర్, కటక్ తర్వాత, అహ్మదాబాద్‌లో కూడా భారతదేశం వన్ సైడ్ విక్టరీ సాధించింది. అహ్మదాబాద్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 356 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ జట్టు కేవలం 214 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత జట్టు సాధించిన ఈ పెద్ద విజయం తర్వాత, అనేక రికార్డులు క్రియేట్ అయ్యాయి. పాత రికార్డులు బద్దలు కొట్టబడ్డాయి. రోహిత్ శర్మ కెప్టెన్‌గా అరుదైన రికార్డును నెలకొల్పారు. అతను ధోని, విరాట్‌లను కూడా అధిగమించాడు. అహ్మదాబాద్ వన్డే తర్వాత ఏ ఐదు పెద్ద రికార్డులు బద్దలయ్యాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

రోహిత్ రికార్డు

రోహిత్ శర్మ నాయకత్వంలో టీం ఇండియా నాలుగు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు. అతను వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిలాండ్ ఇప్పుడు ఇంగ్లాండ్‌పై టీమ్ ఇండియాకు క్లీన్ స్వీప్ విజయాలను అందించాడు. భారత జట్టు ప్రత్యర్థులను మూడుసార్లు క్లీన్ స్వీప్ చేసిన విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనిలను అతను అధిగమించాడు.

టీం ఇండియా నంబర్ 1

గత 14 సంవత్సరాలలో భారత జట్టు వన్డే సిరీస్‌లలో అత్యధిక సంఖ్యలో క్లీన్ స్వీప్‌లను సాధించింది. టీం ఇండియా ఈ ఘనతను 12 సార్లు చేసింది. న్యూజిలాండ్ 10 క్లీన్ స్వీప్ విజయాలతో రెండవ స్థానంలో ఉంది.

శుభ్‌మాన్ గిల్ అద్భుతమైన ప్రదర్శన

అహ్మదాబాద్ వన్డేలో శుభమన్ గిల్ కూడా పెద్ద రికార్డు సృష్టించాడు. ఈ ఆటగాడు 2500 వన్డే పరుగులు చేసిన అత్యంత వేగవంతమైన ఆటగాడిగా నిలిచాడు. దీనితో పాటు అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో 7 వన్డే సెంచరీలు చేసిన ఘనతను కూడా అతను సాధించాడు.

ఒకే వేదికపై హ్యాట్రిక్ సెంచరీలు

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో శుభ్‌మాన్ గిల్ మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఆటగాడు అతనే. దీనితో పాటు అతను ఇదే మైదానంలో ఐపీఎల్ సెంచరీ కూడా సాధించాడు.

విరాట్ కోహ్లీ 16 వేల పరుగులు

విరాట్ కోహ్లీ ఆసియా గడ్డపై అంతర్జాతీయ క్రికెట్‌లో తన 16 వేల పరుగులను కూడా పూర్తి చేశాడు. అతను సచిన్ టెండూల్కర్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు. ఈ సంఖ్యను చేరుకోవడానికి విరాట్‌కు 340 ఇన్నింగ్స్‌లు పట్టగా, సచిన్ దీని కోసం 353 ఇన్నింగ్స్‌లు ఆడాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories