
IND Playing 11 vs PAK: టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో టీమిండియా విజయాలు అందుకకుంది.
IND Playing 11 vs PAK: టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు అద్భుతంగా ఆడుతోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో టీమిండియా విజయాలు అందుకకుంది. అమెరికాపై బ్యాటింగ్‌లో కాస్త తడబడినా.. బౌలింగ్‌లో మాత్రం సత్తాచాటింది. నమీబియాపై అన్ని విభాగాల్లో అధిపత్యం చెలాయిస్తూ భారీ ఆధిక్యంతో గెలుపొందింది. ఇక శనివారం (ఫిబ్రవరి 15) దాయాది పాకిస్థాన్‌తో భారత్ హై ఓల్టేజ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై కీలక అప్‌డేట్ బయటికి వచ్చింది. పాక్ బలాన్ని దృష్టిలో పెట్టుకుని జట్టు కాంబినేషన్‌లో వ్యూహాత్మక మార్పులు చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు సమాచారం.
ముఖ్యంగా ఓపెనింగ్, స్పిన్ దళంపై టీమ్ మేనేజ్‌మెంట్ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. యువ బ్యాటర్ అభిషేక్ శర్మ పూర్తిగా ఫిట్‌గా ఉండటంతో.. ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. అభిషేక్, ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఆరంభనున్నారు. దీంతో వికెట్‌కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ప్లేయింగ్ 11 నుంచి తప్పుకోనున్నాడు. కడుపు నొప్పి కారణంగా నమీబియాపై అభిషేక్ ఆడలేదు. అతడి స్థానంలో ఆడిన సంజు.. 22 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. వచ్చిన అవకాశాన్ని సంజు చేతులారా వృధా చేసుకున్నాడు. ఇక మెగా టోర్నీలో అతడు ఆడే అవకాశాలు దాదాపు లేనట్లే.
మూడో స్థానంలో తిలక్ వర్మ, నాలుగులో సూర్యకుమార్ యాదవ్ ఆడుతారు. ఈ ఇద్దరు హాఫ్ సెంచరీలు చేసి మంచి ఫామ్ మీదున్నారు. వీరి నుంచి టీమ్ మేనేజ్‌మెంట్ మరో కీలక ఇన్నింగ్స్ ఆశిస్తోంది. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా సేవలు అందిచనున్నాడు. శివమ్ దూబే ఫినిషర్‌గా ఆడుతాడు. పవర్ హిట్టర్ రింకు సింగ్ స్థానంలో స్పిన్ బలం పెంచేందుకు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇవ్వాలని కెప్టెన్, కోచ్ యోచిస్తున్నట్లు సమాచారం. కొలంబో పిచ్ పరిస్థితులు స్పిన్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ స్పిన్ కోటాలో ఆడనున్నారు. అక్షర్ బ్యాటింగ్ టీమిండియాకు కలిసొచ్చే అంశం.
పేస్ దళానికి స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనున్నాడు. బుమ్రా ఇపుడు పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అతని ఫిట్‌నెస్ జట్టుకు పెద్ద బలంగా మారనుంది. బుమ్రా రాకతో మహమ్మద్ సిరాజ్ తుది జట్టు నుంచి తప్ప్పుకోనున్నాడు. అర్షదీప్ సింగ్ రెండో పేసర్‌గా ఆడుతాడు. మూడో పేసర్‌గా హార్దిక్ ఉన్నాడు. మొత్తంగా చూస్తే పాకిస్థాన్ వంటి బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు టీమిండియా మంచి కాంబినేషన్‌తో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. ఈ అప్‌డేట్ అభిమానుల్లో ఉత్కంఠను మరింత పెంచుతోంది.
భారత్ తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




