IND Playing 11 vs NZ: టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. ఆ ఇద్దరు స్టార్స్ అవుట్, భారత్ తుది జట్టు ఇదే!

IND Playing 11 vs NZ
x

IND Playing 11 vs NZ: టీ20 వరల్డ్ కప్ ఫైనల్.. ఆ ఇద్దరు స్టార్స్ అవుట్, భారత్ తుది జట్టు ఇదే!

Highlights

IND Playing 11 vs NZ: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌కు ముందు భారత జట్టు కాంబినేషన్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఓపెనర్ అభిషేక్ శర్మ, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫైనల్ మ్యాచ్‌లో ఆడటం అనుమానంగా మారిందని తెలుస్తోంది.

IND Playing 11 vs NZ: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌కు ముందు భారత జట్టు కాంబినేషన్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. ఓపెనర్ అభిషేక్ శర్మ, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫైనల్ మ్యాచ్‌లో ఆడటం అనుమానంగా మారిందని తెలుస్తోంది. ఆదివారం (మార్చి 8) న్యూజిలాండ్‌తో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు అభిషేక్ ఫామ్ భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

టీ20 వరల్డ్ కప్ 2026లో అభిషేక్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఓపెనర్‌గా అవకాశాలు వచ్చినప్పటికీ ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయి.. జింబాబ్వేపై హాఫ్ సెంచరీ చేశాడు. ఫామ్ అందుకున్నాడని అందరూ అనుకున్నా.. ఆ జోరును కొనసాగించలేకపోయాడు. వెస్టిండీస్‌పై సూపర్-8, ఇంగ్లండ్‌తో సెమీఫైనల్లో తీవ్రంగా నిరాశపర్చాడు. దాంతో సర్వత్రా విమర్శలు వచ్చాయి. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న అతడిని తుది జట్టు నుంచి తప్పించాలని అటు ఫాన్స్, ఇటు మాజీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జట్టు మేనేజ్‌మెంట్ ఓపెనింగ్ కాంబినేషన్‌లో మార్పులు చేసే అవకాశముందని సమాచారం. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొత్త కాంబినేషన్‌పై ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

అభిషేక్ స్థానంలో రింకు సిం‌గ్‌లోను జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రింకు జట్టులోకి వస్తే.. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా వస్తారు. తిలక్ వర్మ, సూర్యకుమార్ 3, 4 స్థానాల్లో ఆడనున్నారు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేయనున్నారు. స్పిన్ విభాగంలో మార్పులు కూడా ఉండొచ్చని సమాచారం. కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుణ్ చక్రవర్తి ఈ టోర్నీలో పెద్దగా ప్రభావం చూపలేదు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లపై అతను ఆశించిన స్థాయిలో వికెట్లు తీయలేకపోయాడు. దీంతో అతని ఆత్మవిశ్వాసం పూర్తిగా తగ్గినట్టుగా కనిపిస్తోంది. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ కొనసాగనున్నారు. ఆల్‌రౌండర్‌లుగా హార్దిక్, అక్షర్ బౌలింగ్ చేయనున్నారు.

భారత జట్టు (అంచనా):

సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.

Show Full Article
Print Article
Next Story
More Stories