కీవీస్ బ్యాడ్ లక్... మరో సూపర్ ఓవర్ లోనూ భారత్ విజయం

కీవీస్ బ్యాడ్ లక్... మరో సూపర్ ఓవర్ లోనూ  భారత్ విజయం
x
Highlights

వెల్లింగ్టన్ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టీ 20 మ్యాచ్ ముందుగా ఉత్కంఠ బరితంగా సాగి టైగా ముగిసింది.

వెల్లింగ్టన్ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టీ 20 మ్యాచ్ ముందుగా ఉత్కంఠ బరితంగా సాగి టైగా ముగిసింది. ఈ క్రమంలో సూపర్ ఓవర్ అనివార్యం అయింది. అయితే అందులో ముందుగా బ్యాటింగ్ కి దిగిన న్యూజిలాండ్ జట్టు ఒక వికెట్ ని కోల్పోయి ఆరు బంతుల్లో 12 పరుగలు చేసింది. అ తర్వాత బరిలోకి దిగిన భారత్ జట్టు ఒక వికెట్ నష్టపోయి ఆ లక్ష్యాన్ని చేధించింది. ఇందులో మొదటి రెండు బంతుల్ని రాహుల్ సిక్స్ , ఫోర్ గా మలిచాడు. ఆ తర్వాతి బంతికి అవుట్ అయ్యాడు. ఇక ఆ తరవాత బంతికి రెండు పరుగులు వచ్చాయి. ఇదో బంతికి కోహ్లి ఫోర్ గా మలిచి జట్టుకు విజయాన్ని అందించాడు.

అంతకుముందు భారత్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ గుప్తిల్ (4) బుమ్రా బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయి కీపర్ కి చిక్కాడు. ఆ తరవాత మరో వికెట్ పడకుండా మన్రో(64), సీఫెర్ట్ జట్టు స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు. జట్టు స్కోర్ 97 పరుగుల వద్ద మన్రో అవుట్ అయ్యాడు.

ఇక ఆ తర్వాత వచ్చిన టామ్ బ్రూస్ డకౌట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన రాస్ టేలర్(24) తో జత కట్టిన సీఫెర్ట్ జట్టు స్కోర్ ని పరుగులు పెట్టించాడు. ఇక చివరి ఓవర్ లో మ్యాచ్ ఉత్కంఠని కలిగించింది. చివరి ఆరు బంతుల్లో ఏడూ పరుగులు అవసరం అనుకున్న క్రమంలో కీవిస్ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసింది. దీనితో మ్యాచ్ టై అయింది. అంతకు ముందు భారత జట్టు నిర్ణిత 20 ఓవర్లలో ఎనమిది వికెట్లను కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇప్పుడు మరో సూపర్ ఓవర్ జరగనుంది.

ఈ సీరీస్ లో గత మ్యాచ్ కూడా టైగానే ముగిసింది. అప్పుడు కూడా విజయం భారత్ నే వరించింది. ఇక ఇప్పటికే మూడు మ్యాచ్ లు గెలిచి సిరీస్ ని సొంతం చేసుకుంది. చివరి మ్యాచ్ ఆదివారం జరగనుంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories