IND vs SL: సూపర్ ఓవర్‌లో సూపర్ విజయం.. శ్రీలంకను ఓడించిన భారత్


IND vs SL: శ్రీలంకతో జరిగిన మూడవ టీ20తో భారత్ విజయం సాధించింది. శ్రీలంకను క్లీన్ స్వీప్ చేసింది. సూపర్ ఓవర్ కు దారి తీసిన ఈ మ్యాచులో శ్రీలంక నిర్దేశించిన 3 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 1 బంతికే ఛేదించి విజయాన్ని సొంతం చేసుకుంది.
IND vs SL:పల్లెకెలె మైదానంలో భారత్-శ్రీలంక మధ్య మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు శ్రీలంక జట్టుకు 138 పరుగుల లక్ష్యాన్ని అందించింది. దీంతో శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. దీంతో స్కోరు సమమైంది. ఆ తర్వాత సూపర్ ఓవర్‌లో శ్రీలంక భారత్‌కు 3 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు.
భారత్ బౌలింగ్‌లో రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ అద్భుత ప్రదర్శన చేశారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు 19వ, 20వ ఓవర్లు బౌలింగ్ చేశారు. ఈ ఆటగాళ్లు తలా 2 వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌లోకి వెళ్లడంతో టీమ్ ఇండియా సులువుగా గెలిచింది.
रिंकू सिंह ने एक ओवर में लिए 2 विकेट ,,मजा आ गए ...👍👍👏👏🇮🇳🇮🇳🇮🇳🥰🥰😅😅#IndVsSL#RinkuSingh #GautamGambir #BCCI#SuryakumarYadav pic.twitter.com/c9xIPIbRG8
— Ravi (@Ravi52932545) July 30, 2024

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



