మూడో వన్డేలో జింబాబ్వేపై భారత్ గెలుపు..

India  Defeat Zimbabwe by 13 Runs and Clean Sweep ODI Series
x

మూడో వన్డేలో జింబాబ్వేపై భారత్ గెలుపు..

Highlights

IND VS ZIM: సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా

IND VS ZIM: జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్​ను భారత్ క్లీన్​స్వీప్ చేసింది. మూడో వన్డేలో ఆతిథ్య జట్టుపై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్​ను 3-0తో కైవసం చేసుకుంది. గత రెండు వన్డేల్లో పూర్తిగా విఫలమైన జింబాబ్వే.. తాజా మ్యాచ్​లో బ్యాటింగ్​లో కాస్త ఫర్వాలేదనిపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేఎల్ రాహుల్ సేన 50 ఓవర్ల తర్వాత 8 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. ధావన్​తో కలిసి బ్యాటింగ్​కు దిగిన రాహుల్.. పరుగులు చేసేందుకు చెమటోడ్చాడు. రాహుల్ ఔట్ అయిన తర్వాత వచ్చిన యువ బ్యాటర్ శుభ్‎మన్​ గిల్.. ఈ మ్యాచ్​లో అదరగొట్టాడు. చక్కటి ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ధావన్ వెనుదిరిగినా.. ఇషాన్ కిషన్ తో కలిసి సాధికారికంగా బ్యాటింగ్ చేసి సెంచరీతో చెలరేగాడు. మొత్తంగా 97 బంతుల్లో 130 పరుగులు చేసి సచిన్ రికార్డును బద్దలుకొట్టాడు. జింబాబ్వేపై అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన భారత బ్యాటర్​గా రికార్డుకెక్కాడు. తో నిలిచింది. అటు 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు.. తడబడుతూ ఇన్నింగ్స్ ఆరంభించినా.. విక్టరీ కోసంచెమటోడ్చినా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో ఆవేశ్​ ఖాన్​ మూడు వికెట్లు తీశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories