IND vs BAN: టెస్ట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ, సెంచరీ.. మనోళ్ల దెబ్బకు ప్రపంచ రికార్డ్ నమోదు

india breaks fastest team century in test cricket and most sixes by a team in a calendar year record at kanpur test
x

IND vs BAN: టెస్ట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ, సెంచరీ.. మనోళ్ల దెబ్బకు ప్రపంచ రికార్డ్ నమోదు

Highlights

India Breaks Fastest Team 100s in Test Cricket: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు చరిత్ర సృష్టించింది.

India Breaks Fastest team 100s in Test cricket: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కలిసి తొలి మూడు ఓవర్లలో 50 పరుగులు చేశారు. టెస్టు చరిత్రలో ఏ జట్టు చేసిన వేగవంతమైన అర్ధసెంచరీ ఇదే కావడం గమనార్హం. దీని తర్వాత టీమ్ ఇండియా ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ కూడా చేసింది.

రోహిత్, యశస్విల తుపాన్ బ్యాటింగ్..

ఈ వర్షం ప్రభావిత మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ బంగ్లాదేశ్ బౌలర్లపై విపరీతంగా దాడి చేశారు. హసన్ మహమూద్‌ను వరుసగా మూడు ఫోర్లు కొట్టి యశస్వి వేగంగా ఆరంభించాడు. ఆ తర్వాత, ఖలీద్ అహ్మద్ వేసిన బంతిని రోహిత్ శర్మ వరుసగా రెండు సిక్సర్లు కొట్టి బంగ్లాదేశ్ జట్టును ఆశ్చర్యపరిచాడు. రోహిత్‌ తొలి సిక్స్‌ స్డేడియం డగౌట్‌లో వేసిన టెంట్‌పైన పడింది.

టెస్టు క్రికెట్‌లో సరికొత్త రికార్డు..

రోహిత్, యశస్వి కలిసి కేవలం మూడు ఓవర్లలోనే భారత్ 50 పరుగులను పూర్తి చేశారు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఏ జట్టు చేసిన వేగవంతమైన 50 పరుగులు ఇదే. అంతకుముందు ఈ ఏడాది వెస్టిండీస్‌పై 4.2 ఓవర్లలో 50 పరుగులు చేసిన రికార్డ్ ఇంగ్లండ్ పేరిట ఉంది.

కేవలం 61 బంతుల్లోనే 100 పరుగులు..

ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన తర్వాత భారత్ ఫాస్టెస్ట్ 100 పరుగుల రికార్డును కూడా సృష్టించింది. అయితే, ఈ రికార్డు ఇంతకుముందు కూడా భారత్ పేరిట మాత్రమే నమోదైంది. 2023లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 12.2 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసింది. కాన్పూర్‌లో బంగ్లాదేశ్‌పై కేవలం 10.1 ఓవర్లలో 100 పరుగులు సాధించింది.

టెస్టు క్రికెట్‌లో వేగవంతమైన జట్టు సెంచరీ (ఓవర్ల వారీగా)

10.1- భారతదేశం vs బంగ్లాదేశ్, కాన్పూర్, 2024

12.2- భారతదేశం vs వెస్టిండీస్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, 2023

13.1- శ్రీలంక vs బంగ్లాదేశ్, కొలంబో, 2001

13.4- బంగ్లాదేశ్ vs వెస్టిండీస్, మిర్పూర్, 2012

13.4-ఇంగ్లండ్ vs 2 పాకిస్థాన్, 2 కరాచి

13.4- ఇంగ్లండ్ vs పాకిస్తాన్, రావల్పిండి, 2022

13.6- ఆస్ట్రేలియా vs ఇండియా, పెర్త్, 2012

ఆరో రికార్డు సృష్టించిన భారత్‌..

భారత్ తన పేరిట మరో రికార్డు సృష్టించింది. క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన దేశంగా నిలిచాడు. ఈ విషయంలో ఇంగ్లండ్‌ రికార్డును టీమిండియా బద్దలు కొట్టింది. 2022లో ఇంగ్లిష్ జట్టు 89 సిక్సర్లు కొట్టింది. అదే సమయంలో, భారత్ 2021లో 87 సిక్సర్లు కొట్టగా, న్యూజిలాండ్ 2014లో 81 సిక్సర్లు, 2023లో 71 సిక్సర్లు కొట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories